
Renault Duster: భారత ఆటోమొబైల్ మార్కెట్ లో రెనాల్ట్ డస్టర్‌కి ఉన్న క్రేజ్ మళ్లీ వచ్చేలా ఉన్నట్లు తాజా అప్డేట్స్ సూచిస్తున్నాయి. రెనాల్ట్ పూర్తిగా కొత్త తరం డస్టర్ SUVను జనవరి 26, 2026న భారత్‌లో అధికారికంగా లాంచ్ చేయనుంది. రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించిన స్పై ఫోటోలు ఈ కారు సంబంధించిన డిజైన్, ఎక్స్టీరియర్ లుక్‌ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. హ్యుందాయ్ క్రెటాకు పోటీ ఇచ్చేలా సిద్ధమవుతున్న ఈ కొత్త డస్టర్, రెనాల్ట్ SUV లైనప్‌కు మరోసారి బలమవుతుందని అంచనా.
కొత్త జనరేషన్ డస్టర్ (Renault Duster) పూర్తిగా పాత మోడల్లోని మెకానికల్ లేదా డిజైన్ ఎలిమెంట్స్ ఏవీ ఇందులో కొనసాగించలేదు. ఇది CMF-B ప్లాట్‌ఫామ్‌పై తయారు అవుతుంది. భారత్‌లోని ఒరగడం ప్లాంట్ లో దీనిని తయారు చేయనున్నారు. కొత్త ప్లాట్‌ఫామ్, కొత్త డిజైన్, కొత్త టెక్నాలజీలతో డస్టర్ భారత మార్కెట్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. నిజానికి రెనాల్ట్ ఇంటర్నేషనల్ గేమ్ ప్లాన్ 2027లో కీలక భాగం కానుంది. డస్టర్ రీఎంట్రీ, రెనాల్ట్ రూపొందించిన International Game Plan 2027 వ్యూహంలో ఒక ప్రధాన అడుగు. ఈ వ్యూహంలో భాగంగా.. బడ్జెట్ అర్బన్ ఎలక్ట్రిక్ వెహికల్, మూడు వరుస SUVలు, కొత్త డస్టర్ భాగంగా ఉన్నాయి.
Lionel Messi : తెలంగాణకి మెస్సీ మెగా విజిట్.!
ప్రస్తుతం కిగర్ మాత్రమే ఉన్న రెనాల్ట్ SUV లైనప్‌లో డస్టర్ తిరిగి రావడం కంపెనీకి పెద్ద బూస్ట్‌గా మారనుంది. రగ్డ్ లుక్‌తో ఆకట్టుకుంటున్న కొత్త డిజైన్ (స్పై షాట్స్) ప్రకారం.. కొత్త డస్టర్ మరింత రగ్డ్, స్టైలిష్ రూపాన్ని దాల్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా Y-షేప్ LED DRLs, పాలిగనల్ హెడ్‌ల్యాంప్స్, మసిల్ లుక్ ఇచ్చే రగ్డ్ ఫ్రంట్ బంపర్, బోల్డ్ RENAULT లెటరింగ్ ఉన్న గ్రిల్, పాలిగనల్ వీల్ ఆర్చెస్, హెవీ బాడీ క్లాడింగ్, స్పోర్టీ రూఫ్ రైల్స్, ORVMలలో టర్న్ ఇండికేటర్ ఇంటిగ్రేషన్, C-పిల్లర్‌లో డోర్ హ్యాండిల్స్, వెనుక వైపు నాచ్డ్ రియర్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రేక్డ్ రియర్ విండ్‌షీల్డ్ అలాగే ఇండియన్ వర్షన్లో గ్లోబల్ మోడల్‌తో పోలిస్తే వేరే అల్లాయ్ వీల్ డిజైన్ రావచ్చని సమాచారం.