
OnePlus Ace 6T: OnePlus కంపెనీ డిసెంబర్ 3న చైనాలో OnePlus Ace 6T ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ ప్రపంచంలోనే తొలి 8300mAh అల్ట్రా-లార్జ్ సామర్థ్య బ్యాటరీ కలిగిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు పొందబోతోంది. అలాగే 100W SuperVOOC ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఇక ఈ Ace 6T మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది క్వల్కమ్ అత్యాధునిక Snapdragon 8 Gen 5 చిప్‌సెట్‌తో వచ్చే తొలి స్మార్ట్‌ఫోన్. కంపెనీ ప్రకారం ఈ ఫోన్ AnTuTu 11 బెంచ్‌మార్క్‌లో 3.56 మిలియన్ పాయింట్లు సాధించింది, ఇది ఇప్పటివరకు ఫోన్‌లో కనిపించని స్థాయి పనితీరు ఇది.
డిజైన్ పరంగా Ace 6T మరింత స్టైలిష్, ప్రీమియమ్‌గా కనిపించబోతోంది. ఫ్లాష్ బ్లాక్, ఫాంటమ్ గ్రీన్, ఎలక్ట్రిక్ పర్పుల్ అనే మూడు ఆకర్షణీయ రంగుల్లో వస్తోంది. మెటల్ ఫ్రేమ్, చిన్నదిగా ఉండడమే కాకుండా తక్కువగా బయటకు వచ్చే మెటల్ క్యూబ్ కెమెరా డెకో, అల్ట్రా నారో బెజెల్స్ ఉన్న పెద్ద AMOLED ఫ్లాట్ డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్‌తో ఫోన్ మరింత సన్నగా ఉంటుంది. అలర్ట్ స్లైడర్ స్థానంలో కొత్త షార్ట్‌కట్ కీ ఇవ్వబడటం మరో ముఖ్యమైన మార్పు. ఫోన్ బాడీకి సిల్క్ గ్లాస్, ఫైబర్ గ్లాస్ ఫినిష్ ఉపయోగించారు. మొత్తంగా చూస్తే OnePlus Ace 6T ఫ్లాగ్‌షిప్ మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతోంది. అత్యధిక బ్యాటరీ లైఫ్, కొత్త జనరేషన్ పనితీరు, ప్రీమియమ్ డిజైన్‌తో యూజర్ల కోసం ఇది ప్రత్యేక ఎంపికగా నిలవనుంది.
Jio Prepaid Plan: జియో చౌకైన ప్లాన్.. రోజుకు 1GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్