సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్న మెలోడీ బ్రహ్మ మణిశర్మ

Sudigali Sudheer Divya Bharathi Mai Lead And Melody Brahma Mani Sharma Joins G O A T Movie For Background Score

సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘G.O.A.T’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రం‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్ పతాకాలపై ‘అద్భుతం’, ‘టేనంట్’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంతో, కామెడీ ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ సినిమాలో సుధీర్ సరసన దివ్యభారతి నటిస్తోంది. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.

Digital India: డిజిటల్ యుగంలో ప్రతి భారతీయుడు స్మార్ట్ఫోన్లో తప్పక ఉండాల్సిన ప్రభుత్వ యాప్‌లు ఇవే!

ఇటీవల విడుదలైన తొలి సింగిల్ ‘ఒడియమ్మ’ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. లియోన్ జేమ్స్ స్వరపరచిన ఈ లవ్ మెలోడీ తక్కువ సమయంలోనే వైరల్ అయ్యి, సుడిగాలి సుధీర్ కెరీర్‌లో అత్యంత వేగంగా పాపులర్ అయిన పాటగా నిలిచింది. విడుదలైన ఒక్క రోజులోనే రికార్డు స్థాయి వ్యూస్ సాధించడంతో పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు అన్నీ హిట్ కావడంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది.

తాజాగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడానికి టీంలో చేరడం వల్ల సినిమా హైప్ గణనీయంగా పెరిగింది. అనుభవజ్ఞుడైన ఈ సంగీత దర్శకుడు చేరడంతో ఫ్యాన్స్‌లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తోంది. సినిమా అనుకున్నదానికంటే బాగా వచ్చిందని నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తూ, చిత్రాన్ని త్వరలోనే గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నారు.

Siliguri corridor: సిలిగురి కారిడార్‌లో కొత్త సైనిక స్థావరాలు.. బంగ్లా, పాక్, చైనాలకు గట్టి మెసేజ్..

ఈ సినిమాలో సుడిగాలి సుధీర్, దివ్యభారతి, మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వి, అడుకులం నరైన్, ఆనందరామరాజు, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, నవీన్ నేని నటిస్తుండగా.. జైశ్నవ్ ప్రొడక్షన్ & మాహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతుంది.