
Realme C85 5G: రియల్‌మీ భారత మార్కెట్‌లో కొత్తగా బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ realme C85 5G ను అధికారికంగా లాంచ్ చేసింది. C సిరీస్‌లోకి కొత్తగా చేరిన ఈ ఫోన్ డిజైన్, పనితీరు, డ్యూరబిలిటీ వంటి విభాగాల్లో కొత్త ప్రమాణాలను సెట్ చేస్తూ వినియోగదారులను టార్గెట్ చేసేలా ఉంది. ఈ మోడల్ ముఖ్యంగా రగ్డ్ వాడుక కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు కనిపిస్తోంది.
ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌ను, 144Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ సాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు స్క్రోలింగ్, గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇక ఇందులో MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్ రావడంతో పాటు 8GB ర్యామ్, 10GB వరకు డైనమిక్ ర్యామ్ పెంచుకునేలా కూడా ఉంది. ఇక 5300+ mm² VC కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఇచ్చారు. ఇవి ఫోన్‌ను హీట్ సమస్యల నుండి కాపాడుతూ స్మూత్ మల్టీటాస్కింగ్‌ను అందిస్తాయి.
Nirmala Sitharaman: అమరావతి నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం.. దేశంలోనే ఇది మొదటిసారి!
కెమెరా విభాగంలో 50MP Sony IMX852 ప్రధాన కెమెరాను అందించారు. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. AI ఎడిట్ గిని వంటి టూల్స్ ఫోటో ఎడిటింగ్‌ను మరింత సులభతరం చేయనున్నాయి. ఈ ఫోన్ ప్రత్యేకతల్లో ఒకటి దీని డ్యూరబిలిటీ. ఇది IP66, IP68, IP69, IP69 ప్రో వంటి మల్టిపుల్ రేటింగ్స్‌తో పాటు 6 మీటర్ల లోతులో 30 నిమిషాల పాటు నీటిలో ఉండగలిగే సామర్థ్యం ఉంది. అంతేకాదండోయ్.. 36 రకాల లిక్విడ్స్ నుండి రక్షణతో పాటు 2 మీటర్ల వరకు డ్రాప్స్‌ను తట్టుకునే MIL-STD 810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంది.
దీని వల్ల ఈ మొబైల్ “Most people performing a mobile phone water resistance test” కేటగిరీలో గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness World Records) సాధించింది. ఇక 7000mAh భారీ బ్యాటరీని 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందించారు. దీనిరాహా మొబైల్ 2 రోజుల వరకు నిడివిని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 6.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా ఉంది. అదనపు ఫీచర్లలో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 400% అల్ట్రా వాల్యూం స్పీకర్, డ్యూయల్ 5G సపోర్ట్, USB Type-C పోర్ట్ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి.
Water Chestnuts Benefits: సింగాడా దుంపలకు మార్కెట్లో భారీ డిమాండ్… కారణం ఇదే!
రియల్‌మీ C85 5G పార్రోట్ పర్పుల్, పీకాక్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇక ధర విషయానికి వస్తే ఇందులో 4GB+128GB మోడల్ ధర రూ.15,499 కాగా, 6GB+128GB వేరియంట్‌ను రూ.16,999కి లాంచ్ చేశారు. అలాగే దీనికి రూ.500 కూపన్ డిస్కౌంట్‌తో లభిస్తాయి.