
అనంతపురం నగరంలోని శారద నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా రామగిరి డిప్యూటీ తాహసీల్దార్ భార్య, కుమారుడు ఇద్దరు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. మూడున్నర ఏళ్ల బాలుడు సహర్షను తల్లి అమూల్య గొంతు కోసి చంపింది. కుమారుడిని హత్య చేశాక ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అనంతపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నారు.
Also Read: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం!
కర్నూలు జిల్లాకు చెందిన అమూల్యకి, తాడిమర్రి ప్రాంతానికి చెందిన రవితో 5 ఏళ్ల ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడున్నర ఏళ్ల సహర్ష అనే బాలుడు ఉన్నాడు. గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో తరచూ గొడవ పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కుమారుడిని చంపి, తాను ఆత్మహత్య చేసుకుందా? లేక హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అనంతపురం పట్టణ డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం ద్వారా సంఘటన ప్రాంతంలో పరిశీలించారు. మృతురాలు అమూల్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. విచారణ అనంతరం సంఘటనకు గల కారణాలు వెల్లడిస్తామన్నారు.