
నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాన్ ఏర్పడింది. ప్రస్తుతానికి ఇది ట్రింకోమలీ (శ్రీలంక)కి 80 కి.మీ, పుదుచ్చేరికి 480 కి.మీ, చెన్నైకి 580 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 8 కి.మీ వేగంతో తుపాన్ కదిలింది. ఎల్లుండికి నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. దిత్వా తుపాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి.
Also Read: Anantapur Crime: అనంతపురంలో దారుణం.. డిప్యూటీ తాహసీల్దార్ భార్య, కుమారుడు మృతి!
దిత్వా తుపాన్ ప్రభావంతో నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. శని, ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శనివారం నాడు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. శ్రీసత్యసాయి, అనంతపురం, కడప, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ఆదివారం, సోమవారాల్లో కూడా కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.