
ప్రస్తుతం యువతలో అనేక శారీరక, మానసిక మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో 60 ఏళ్ల వయస్సు దాటిన వారిలో మాత్రమే కనిపించే సమస్యలు ఇప్పుడు 10–20 ఏళ్ల మధ్య వయస్సులోనే బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. వెన్నునొప్పి, తీవ్రమైన అలసట, కీళ్ల బలహీనత, స్ట్రెస్ హార్మోన్ల పెరుగుదల, ఆందోళన, చిన్న వయస్సులోనే జుట్టు రాలడం, బట్టతల, డయాబెటిస్, థైరాయిడ్ వంటి జీవక్రియ సంబంధిత వ్యాధులు యువతను వేధిస్తున్నాయి. బయట కారణాలే కాదు, శరీరం లోపల జరిగే మార్పులు కూడా ఈ వృద్ధాప్య లక్షణాలను వేగంగా తెచ్చేస్తున్నాయి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం, చిన్న వయస్సులోనే గుండెపోటు, డయాబెటిస్, అలసట, ఓపిక తగ్గడం, ఎముకల బలహీనత వంటి సమస్యలు పెరుగుతుండడం పెద్ద ప్రమాద సంకేతం. ఈ ఆరోగ్య క్షీణతకు ఆధునిక జీవనశైలే ప్రధాన కారణంగా చెబుతున్నారు.
యువతలో ఆరోగ్య సమస్యల ప్రధాన కారణాలు
-
అధిక స్క్రీన్ టైమ్: చిన్నప్పటి నుంచే మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ల ముందు ఎక్కువ సమయం గడపడం
-
ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం: శారీరక శ్రమ లేకపోవడం వల్ల వెన్నెముక, ఎముకలపై ప్రతికూల ప్రభావం
-
నిద్రలేమి: రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల హార్మోన్ అసమతుల్యత
-
అనారోగ్యకర ఆహారం: ఫాస్ట్‌ఫుడ్, బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల పోషకాహార లోపం, ఊబకాయం
-
స్ట్రెస్ & ఆందోళన: చదువు, కెరీర్ ఒత్తిడి వల్ల హార్మోన్ మార్పులు
ఆరోగ్యాన్ని కాపాడే మంచిన అలవాట్లు
చిన్న వయస్సులోనే రోగాలు రాకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు ఎంతో అవసరం. రోజుకు కనీసం 7–9 గంటలు నిద్రపోవడం. స్క్రీన్ టైమ్‌ను నియంత్రించడం. ప్రతిరోజూ నడక, వ్యాయామం లేదా యోగా చేయడం. ఇంట్లో చేసిన ఆహారం, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడం. ఫాస్ట్‌ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్‌ను తగ్గించడం. రోజూ కొంత సమయం ఎండలో గడపడం (విటమిన్ D కోసం), నీళ్లు బాగా తాగడం మరియు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం. ఈ చిన్న చిన్న అలవాట్లను పాటించడం ద్వారా యువతలో వేగంగా కనిపిస్తున్న వృద్ధాప్య లక్షణాలు, చిన్న వయస్సులో వచ్చే తీవ్రమైన రోగాలను నివారించవచ్చు.
ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించిదని గుర్తించాలి. మీకు సందేహాలు ఉంటే.. ఆరోగ్య నిపుణులను కలిసి సలహా తీసుకోవడం ఉత్తమం.