
ప్రకృతిలో లభించే పండ్లు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అయితే పండిన అరటిపండ్లు, పుచ్చకాయ, ద్రాక్ష, మామిడి, లీచీ వంటి పండ్లలో సహజ చక్కెర శాతం ఎక్కువగా ఉండే కారణంగా, అవి రక్తంలో షుగర్ స్థాయిలను మరియు రక్తపోటును పెంచవచ్చని నిపుణులు చెప్పుతున్నారు. ఈ పరిస్థితులు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు.
పండ్లు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అనేక పోషకాలు కలిగి ఉన్నప్పటికీ, కొన్ని పండ్లను అధికంగా తీసుకోవడం గుండెకు హానికరంగా మారొచ్చు. అరటి, పుచ్చకాయ, ద్రాక్ష, మామిడి, లీచీ లాంటి పండ్లలో అధికంగా ఫ్రూట్ షుగర్ (ఫ్రక్టోజ్) ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరిగి, రక్తపోటు కూడా పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఈ మార్పులు గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి.
పుచ్చకాయ వేసవిలో ఎక్కువగా లభించే పండు. దీనిలో నీటి శాతం అధికంగా ఉన్నప్పటికీ, సహజ చక్కెర కూడా తగినంతగా ఉంటుంది. దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రక్తంలోని గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ స్థాయిలు పెరుగే అవకాశం ఉంది.
పండిన అరటిపండ్లలో చక్కెర ఎక్కువగా ఉండే కారణంగా అవి త్వరగా జీర్ణమై రక్తంలో షుగర్ మరియు రక్తపోటును పెంచవచ్చు. కనుక పూర్తిగా పండిన వాటికన్నా కొంచెం ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే అరటిపండ్లను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ద్రాక్ష పండ్లు ఫ్రక్టోజ్ అధికంగా కలిగి ఉంటాయి. ఎక్కువ ద్రాక్ష తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి గుండె పనితీరును ప్రభావితం చేస్తాయి. ప్రతిరోజూ ఎక్కువ పరిమాణంలో ద్రాక్ష తీసుకోవడం గుండెకు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మామిడి పండ్లలో ఇతర పండ్లతో పోలిస్తే సహజ చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ లేదా గుండె సమస్యలు ఉన్నవారు మామిడి పండ్లను పరిమితంగా, అప్పుడప్పుడు మాత్రమే తినాలి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
లీచీ పండ్లలో కూడా చక్కెర శాతం అధికంగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యలు లేదా మధుమేహం ఉన్నవారికి ప్రమాదకరమవుతుంది. కాబట్టి లీచీని కూడా పరిమితంగా తీసుకోవడం మంచిది.
ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించి సూచనలు పొందడం మంచిందని నిపుణులు అంటున్నారు.