
High Court: పంచాయితీ ఎన్నికలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పంచాయితీ ఎన్నికలపై స్టే విధించ లేమని స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలపై జీఓ 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించింది హైకోర్టు. ఎన్నికలపై స్టే విధించలేమని విచారణ రెండు నెలలకు వాయిదా వేసింది. నోటిఫికేషన్ వచ్చాక తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. “మేమే ఎలక్షన్స్ నిర్వహించాలని ఆదేశించి.. మేమే స్టే ఎలా ఇవ్వగలం” అని కోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.
READ MORE: Trump: కాల్పుల ఎఫెక్ట్.. గ్రీన్ కార్డ్ హోల్డర్స్కు కష్టాలే!.. ట్రంప్ కీలక ఆదేశాలు
మరోవైపు.. బీసీలలో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. సబ్ కేటగిరీ రిజర్వేషన్ కోసం నోటిఫికేష్ విడుదలయ్యాక ఎన్నికను రద్దు చేయాలని కోరుకుంటున్నారా.? అని కోర్టు ప్రశ్నించింది. 42 శాతం రిజర్వేషన్ GO విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మేమే తెలిపాం. ప్రస్తుతం ఆదే పద్దతితో ఎన్నికలు కొనసాగుతున్నాయని కోర్టు తెలిపింది. ఇప్పుడు ఎన్నికలను వాయిదా వేయలేం.. యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.