Bollywood : భారీ రన్ టైమ్ తో రిలీజ్ కాబోతున్న బాలీవుడ్ బిగ్ సినిమా

Bollywoods Big Movie Is About To Be Released With A Huge Run Time

బాహుబలి, పుష్ప2 లాంటి భారీ సినిమాల దెబ్బకి బాలీవుడ్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పటి దాకా లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో ఆకట్టుకున్న రణవీర్ సింగ్ కూడా ఇప్పుడు భారీ యాక్షన్ వైపు టర్న్ తీసుకుని,’ధురంధర్’అనే మాస్ యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ కాంబినేషన్ లో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది దురంధర్. ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాను ‘ఉరి’ దర్శకుడు ఆదిత్య ధర్ 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఇప్పటి కే రిలీజ్ అయిన ట్రయిలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

Also Read : Varanasi : SS రాజమౌళి వారణాసిలో మహేశ్ బాబు మేనళ్లుడు

బి-టౌన్‌లో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ఈ సినిమా మేజర్ మోహిత్ శర్మ బయోపిక్ అని రూమర్స్ రావడంతో దర్శకుడు క్లారిటీ  ఇస్తూ “మోహిత్ శర్మ త్యాగం గొప్పది కానీ దానికి దురంధర్‌కి సంబంధం లేదు. టైమ్ వచ్చాక ఆయన బయోపిక్‌ను గొప్పగా చేస్తాం అని అన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా 3 గంటల 32 నిమిషాల రన్‌టైమ్ తో వస్తోంది. దాంతో దురంధర్ కూడా ఇండియా లాంగెస్ట్ రన్‌టైమ్ మూవీస్ లిస్ట్‌లోకి ఎంటర్ అవుతుంది. పాన్ ఇండియా వేవ్‌లో  భాగంగా RRR, పుష్ప 2, కల్కి, బాహుబలి ఎపిక్ లాంటి సినిమాలు లాంగ్ రన్‌టైమ్ తోనే రిలీజ్ అయ్యాయి. పాన్ వరల్డ్ హైప్ తో వచ్చి ఘన విజయం సాధించాయి కూడా. ఈ నేపధ్యంలో బాలీవుడ్ కూడా ఆ రూట్లో అడుగు వేస్తోందా అనే చర్చ బలంగా వినిపిస్తుంది. కాని, “ధురంధర్ కంటెంట్ స్ట్రాంగ్ ఐతే రన్ టైమ్ మ్యాటర్ కాదు కానీ అదే బలహీనమైతే అంత భారీ నిడివి చూడటానికి ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడే దురంధర్ కి పెద్ద పరీక్ష ఎదురవుతుంది. డిసెంబర్ 5 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఈ సినిమా పాన్ ఇండియా మాస్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.