Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఇరుముడితో విమాన ప్రయాణానికి ఏఏఐ గ్రీన్ సిగ్నల్

Aai Allows Ayyappa Devotees To Fly With Iremmudi

Sabarimala: అయ్యప్ప స్వామి భక్తులకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) శుభవార్త తెలిపింది. శబరిమలకు వెళ్లే మాలధారులు విమానాల్లో ‘ఇరుముడి’ తో ప్రయాణించొచ్చని తాజాగా వెల్లడించింది. విమానంలో కొబ్బరికాయలను స్వాములు తమ వెంట తీసుకెళ్లొచ్చని చెప్పింది.

READ ALSO: Nirmala Sitharaman: అమరావతి నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం.. దేశంలోనే ఇది మొదటిసారి!

అయ్యప్ప స్వాముల నుంచి వచ్చిన వినతుల మేరకు, వారి సౌకర్యార్థం నిబంధనలను సడలించామని ఏఏఐ పేర్కొంది. ఈ నిబంధన అక్టోబర్ 28 (శుక్రవారం) నుంచి అమల్లోకి వస్తుందని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ నిబంధనల సడలింపు అనేది వచ్చే ఏడాది జనవరి 20 వరకు అమలులో ఉంటుందని తెలిపింది. అయ్యప్ప స్వాముల ప్రయాణం సాఫీగా, సేఫ్​గా జరగడానికి కొబ్బరికాయలను క్యాబిన్​లోకి తీసుకెళ్లే ముందు ఎక్స్ రే, ఎక్స్‌‌ప్లోజివ్ ట్రేస్ డిటెక్షన్ (ఈటీడీ), భౌతిక తనిఖీలు ఉంటాయని పేర్కొంది.

READ ALSO: PM Modi: ఉడుపి నాకు చాలా ప్రత్యేకమైంది.. గతాన్ని నెమరువేసుకున్న మోడీ