
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2025 సంవత్సరానికి మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS), హవల్దార్ (CBIC & CBN) రిక్రూట్‌మెంట్ సైకిల్ కోసం తాత్కాలిక ఖాళీల జాబితాను విడుదల చేసింది. ఈ సంవత్సరం మొత్తం 7,948 ఖాళీలను ప్రకటించినట్లు నోటీసులో పేర్కొన్నారు. వీటిలో MTS (18-25 సంవత్సరాలు) కేటగిరీ కింద 6,078 పోస్టులు, 18-27 సంవత్సరాల వయస్సు గల MTS అభ్యర్థులకు 732 పోస్టులు, CBIC, CBN సంస్థలలో హవల్దార్ పోస్టులకు 1,138 పోస్టులు ఉన్నాయి.
Also Read:CM Chandrababu: రైతుల సహకారం మరువలేనిది.. అమరావతిని వినూత్నంగా నిర్మిస్తున్నాం!
మొత్తం ఖాళీలలో, 3,679 అన్‌రిజర్వ్‌డ్ కాగా, 1,973 ఓబీసీలకు, 859 ఎస్సీలకు, 621 ఎస్టీలకు, 816 ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు కేటాయించారు. ఈ ఖాళీలో 310 పోస్టులు దివ్యాంగుల అభ్యర్థులకు, 731 సీట్లు మాజీ సైనికులకు కేటాయించారు. త్వరలో పేపర్-1 పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనుంది. గతంలో మొదట నోటిషికేషన్‌లో ఇచ్చిన ఖాళీలకు 4,375 జత చేసి మొత్తం 5,464 ఖాళీలుగా ప్రకటించగా.. తాజాగా 7,948 పోస్టులుగా ప్రకటించింది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.