Tejas Fighter Jet: ‘తేజస్‌’కు సమస్యలు లేవు.. ప్రపంచానికి హెచ్‌సీఎల్ చీఫ్ స్పష్టమైన సందేశం

Hal Chief Clarifies No Issues With Tejas Fighter Jet

Tejas Fighter Jet: తాజాగా నిర్వహించిన జాతీయ భద్రతా సదస్సులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డీకే సునీల్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబాయ్ ఎయిర్ షో చివరి రోజున భారత యుద్ధ విమానం తేజస్ కూలిపోవడాన్ని దురదృష్టకర సంఘటనగా అభివర్ణించారు. ఈ సంఘటన తేజస్ కార్యక్రమం భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు. తేజస్ యుద్ధ విమానంలో ఎటువంటి లోపాలు లేవని ఆయన వెల్లడించారు.

READ ALSO: Donald Trump: “మూడో ప్రపంచ దేశాల” నుంచి వలసల్ని అనుమతించం.. భారత్ ఈ జాబితాలో ఉందా.?

తేజస్‌లో సమస్య లేదు..
జాతీయ భద్రతా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. “తేజస్‌లో ఎటువంటి సమస్యలు లేవు. ఈ వేదిక నుంచి, ఇది అద్భుతమైన యుద్ధ విమానం అని నేను ప్రకటిస్తున్నాను. ఇది పూర్తిగా సురక్షితమైనది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రతా రికార్డును కలిగి ఉంది” అని ఆయన వెల్లడించారు. దుబాయ్‌లో తేజస్ విమానం కూలిపోవడం దురదృష్టకరమని, ఈ ప్రమాదం తేజస్ భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. తేజస్ యుద్ధ విమానం విదేశీ గడ్డపై కూలిపోవడం ఇదే తొలిసారి. అయితే ఈ ఫైటర్ జెట్ ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే కూలిపోయింది.

ఒక దేశం ముందుకు సాగుతూ.. దాని సొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు, అది అనేక దశలను దాటవలసి ఉంటుందని ఆయన అన్నారు. నేడు మేము ఈ 4.5-తరం విమానాన్ని కొత్త సామర్థ్యాలతో అభివృద్ధి చేసామని, ఇది భారీ విజయం అని వెల్లడించారు. “ప్రస్తుతం మా దగ్గర 180 తేజస్ విమానాలు ఉన్నాయి, భవిష్యత్తులో ఈ సంఖ్య పెరుగుతుంది. ఈ విమానానికి ప్రపంచ వ్యాప్తంగా రక్షణ రంగంలో పెద్ద ఎగుమతి మార్కెట్ కూడా ఉంటుంది” అని ఆయన అన్నారు.

HAL భవిష్యత్తు ప్రాజెక్టులు..
HAL భవిష్యత్తు ఆర్డర్ల గురించి ఆయన మాట్లాడుతూ.. అన్‌మ్యాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్ (U-CAV) – CATS వారియర్ – త్వరలో పూర్తవుతుందని అన్నారు. ఇవి 2026 నాటికి సిద్ధంగా ఉంటాయని, 2027 నాటికి ఆకాశంలో ఎగురుతాయని వెల్లడించారు. అదే విధంగా HAL 2027లో ఎగురుతున్న యుటిలిటీ హెలికాప్టర్ మారిటైమ్ (UHM)పై కూడా పని చేస్తోందని ఆయన తెలిపారు.

READ ALSO: Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఇరుముడితో విమాన ప్రయాణానికి ఏఏఐ గ్రీన్ సిగ్నల్