
PYL signature campaign: సినిమా థియేటర్లలో జరుగుతున్న దారుణ దోపిడీపై సాధారణ ప్రేక్షకుల నుండి యువజన సంఘాల వరకు మండిపడుతున్నాయి. పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితేనే టికెట్ రేట్లను ఆకాశానికి చేరుస్తున్న థియేటర్లు, పండగ సీజన్లో అయితే మరీ రెట్టింపు ధరలు వసూలు చేస్తూ అభిమానుల జేబులకు చిల్లులు పెట్టిస్తున్నాయి. ఫ్యామిలీతో సినిమా చూసే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు థియేటర్ అనుభవం ఇప్పుడు విలాసంగా మారిపోయింది.
400% అల్ట్రా స్పీకర్, IP69 ప్రో రేటింగ్, 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ తో Realme C85 5G లాంచ్..!
టికెట్ ధరలు పెరిగినా కనీసం మంచి సేవలు అందిస్తారా అన్న ప్రశ్నకు కూడా సమాధానం లేదు. సినిమాకు వెళ్లిన తరుణంలో టికెట్లు మాత్రమే కాదు, థియేటర్ లోపల స్నాక్స్ పేరుతో జరుగుతున్న దోపిడీ మరింత బాధాకరం. బయట 20 రూపాయలకు లభించే పాప్‌కార్న్‌కు థియేటర్లో 300-500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఒక వాటర్ బాటిల్‌కు 100-150 రూపాయలు, ఒక కప్పు కాఫీకి 250 రూపాయలు తీసుకోవడం ప్రేక్షకులపై పడుతున్న అదనపు భారంగా మారింది.
SSC Recruitment 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 7,948 ఎంటీఎస్, హవల్దార్ జాబ్స్..
ఇక పార్కింగ్ విషయానికి వస్తే.. పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడానికి అనుమతి లేకపోయినప్పటికీ, చాలా థియేటర్లు భారీ మొత్తాలను వసూలు చేస్తూ ప్రేక్షకులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సినిమా చూడటానికి వచ్చిన ప్రజలు పార్కింగ్ ఫీజు కూడా మరో టికెట్ రేట్లా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టాలని, సాధారణ ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ PYL (యువజన సంఘం) ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. టికెట్ ధరలు, స్నాక్స్ ధరలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని యువజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అతి త్వరలో ఈ సంతకాలన్నింటినీ సంబంధిత అధికారులకు అందజేసి, నియంత్రణ విధానాల కోసం పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.