
Jagga Reddy : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మరోసారి బీజేపీపై, ముఖ్యంగా బీజేపీ నేత లక్ష్మణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, గాంధీ కుటుంబంపై వ్యాఖ్యలు చేసిన లక్ష్మణ్‌కు అనుభవం, అవగాహన ఏమీ లేవని, చరిత్రకు గౌరవం తెలియదని మండిపడ్డారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. “బీజేపీ లక్ష్మణ్ వయస్సు 69 ఏళ్లు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు. అప్పటికి ఆయనే పుట్టలేదు. అలా ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ ఇంట్లో 3 ఎంపీ సీట్లు ఎందుకని మాట్లాడతాడా?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పుట్టింది 140 ఏండ్ల క్రితం. మీ పార్టీ పుట్టింది 40 ఏండ్ల క్రితం. మా చరిత్ర, మీ చరిత్రకు 100 ఏళ్ల తేడా ఉంది. అర్హతలేని వ్యాఖ్యలు చేయడం బీజేపీ నాయకులకు అలవాటయ్యింది అని అన్నారు.
Jio Prepaid Plan: జియో చౌకైన ప్లాన్.. రోజుకు 1GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్
అలాగే, రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలు దేశం మొత్తం తెలుసు. మీ బీజేపీలో ఎవరైనా అలాంటి త్యాగం చేశారా? అని ప్రశ్నించారు. లక్ష్మణ్… నోరు ఉంది అని ఎవరిపైనా మాట్లాడలేం. ముందుగా మీ అమ్మ–నాన్నను అడుగు. గాంధీ కుటుంబం అంటే ఏమిటో వాళ్లతో తెలుసుకో. దేవుళ్ల తర్వాత దేవుళ్లు వాళ్లే అని చెబుతారు అని జగ్గారెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
లక్ష్మణ్‌కి స్వయంగా 3-4 పదవులు వచ్చాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ కూడా. దేశం కోసం ఏమి చేశాడు? అలాంటి వ్యక్తి రాహుల్ గాంధీని విమర్శించడం ఏం న్యాయం? అని ప్రశ్నించారు. మోడీ ప్రధాని అయ్యి 12 ఏళ్లు అయ్యింది. దేశానికి ఏ పెద్ద కంపెనీ తెచ్చారు? ఏ పెద్ద పరిశ్రమను పెట్టించారు? ఏ మేజర్ డెవలప్మెంట్ చేశారో చెప్పండి అని అన్నారు. బీజేపీ సిద్ధమైతే ఓపెన్ డిబేట్‌కు సిద్ధం. మేము ఏం చేశాం… మీ మోడీ ఏం చేశాడు… చూసుకుందాం. ప్రజలముందే చర్చ జరగాలి అని జగ్గారెడ్డి ప్రకటించారు.
బీజేపీ దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తుంది.. రెండో సారీ..మూడో సారి అధికారంలోకి వచ్చింది దొంగ ఓట్లతోనే అని ఆయన విమర్శించారు. సంగారెడ్డి ప్రజలు ఇచ్చిన అవకాశం తో ఎంతో అభివృద్ధి చేశా అని ఆయన అన్నారు. నేను నారాజ్ అయ్యేంత వీక్ లీడర్ ను కాదని, రాజకీయాల్లో అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఉండదన్నా జగ్గారెడ్డి. సంగారెడ్డి డీసీసీ నిర్మలనే వద్దన్నారని, దామోదర రాజనర్సింహ ఏది డిసైడ్ చేస్తే అదే ఫైనల్ అని ఆయన వెల్లడించారు. రాజకీయాల్లో అలిగిన వాడు బుద్ధి తక్కువ వాడని, అలిగిన వాని అంత బుద్ధి తక్కువ వాడు ఇంకోడు ఉండడని ఆయన అన్నారు.