
Rajasthan Royals: క్రికెట్లో అన్ని ఫార్మెట్లు ఒక లెక్క ఐపీఎల్ మాత్రం మరొక లెక్క. క్రికెట్ అభిమానులలో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. కొత్త సీజన్ స్టార్ట్ కాకముందు నుంచే ఐపీఎల్ 2026 నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఐపీఎల్ కొత్త సీజన్ సరికొత్త వార్తల ద్వారా సంచలనంగా మారింది. ఇంతకీ ఆ వైరల్ న్యూస్ ఏమిటంటే.. ఈ కొత్త సీజన్లో మరోక జట్టు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ జట్టు ఏంటి, దాని కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Phase-2 Land Pooling: రెండో విడత ల్యాండ్ పూలింగ్..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఐపీఎల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు చేతులు మారనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు అమ్మకానికి రాబోతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. హర్ష్ గొయెంకా తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో ‘‘ఒకటి కాదు.. రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి ఉన్నట్లు తెలిసింది. అవే ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్. వీటిని దక్కించుకునేందుకు రేసులో నలుగురు, ఐదుగురు ఉన్నారు. వీరిలో ఈ ఫ్రాంఛైజీలు ఎవరికి దక్కనున్నాయో..! కొత్త యజమానులు ఎక్కడినుంచి వస్తారో..?’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆర్.ఆర్. జట్టు .. రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ చేతుల్లో ఉంది. ఈ ఫ్రాంఛైజీలో కంపెనీకి 65శాతం వాటా ఉంది.
ఇటీవల ఆర్సీబీ ఫ్రాంఛైజీ యజమాని అయిన డియాజియో కంపెనీ ఈ ఐపీఎల్ జట్టును అమ్మడానికి పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు డియాజియో కంపెనీ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమాచారం కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ కంపెనీ ఆర్సీబీ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టే వారి కోసం చూస్తున్నట్లు, ఈ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తికానున్నట్లు తెలిపింది. ఈ ఏడాది అక్టోబరులో ఈ జట్టు అమ్మకం గురించి ఫస్ట్ ప్రముఖ పారిశ్రామికవేత్త అదర్ పూనావాలా హింట్ ఇచ్చారు.
READ ALSO: Sidharth – Kiara: పాప పేరును రివీల్ చేసిన స్టార్ కపుల్..