Botsa Satyanarayana: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలా..? ప్రైవేట్ ఆధీనంలో ఉండాలా..? ప్రజాభిప్రాయ సేకరణ

Botsa Satyanarayana Slams Ap Govt Over Move To Privatize Palakollu Medical College

Botsa Satyanarayana: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలకు అన్యాయం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఏ దేశంలో అయినా విద్యా, వైద్య రంగాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం అంటే పేదవాడికి, సామాన్యుడికి అందుబాటులో ఉండే సేవలు, అని బొత్స వ్యాఖ్యానించారు.వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలంలో ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తిచేసి, మిగిలిన వాటికీ నిధులు కేటాయించిన విషయం గుర్తు చేశారు.

Read Also: PM Modi: ఉగ్రదాడి జరిగినా గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు..

ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వాలని చూస్తోందని విమర్శించారు.. కూటమి ప్రభుత్వం అవినీతికి అలవాటు పడింది. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది, అని బొత్స మండిపడ్డారు. ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వంలోనే కొనసాగాలా? లేక ప్రైవేట్ రంగానికి అప్పగించాలా? అన్న అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోటిసంతకాల సేకరణ చేపడుతున్నామని తెలిపారు.

మరోవైపు, పాలకొల్లు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై మాట్లాడండి, ఆలోచించండి అని మంత్రి నిమ్మల రామానాయుడు తాను అడిగిన వ్యాఖ్యలపై స్పందించిన బొత్స.. నీకింతమ్మా – నాకు అంతమ్మా అని మాట్లాడటం సరిపోతుందా? ఇప్పుడు విద్యార్థులకు ఎంత ఇచ్చి చదివిస్తారు? చెప్పగలరా?” అని నిలదీశారు.. ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని, రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన విద్య, వైద్యం అంశాలలో రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..