
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన ఏపీ లిక్కర్ కేసులో పిటిషన్లపై ఈరోజు జరిగిన విచారణలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఏ–2 వాసుదేవ రెడ్డి, ఏ–3 సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న సందర్భంగా, సహనిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ పై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. సహనిందితుడు ఇంప్లీడ్ పిటిషన్ వేయడం కొత్త విషయం కాదన్న కోర్టు.. కేసులో ఫిర్యాదు చేసిన వారు ఇంప్లీడ్ అవడాన్ని చూశాం.. కానీ, సహ నిందితుడు ఇంప్లీడ్ అవటం చాలా అరుదైన విషయం.. ఇది కొత్తగా ఉంది .. దీంతో కోర్టు పిటిషన్‌పై మరింత పరిశీలన అవసరమని స్పష్టం చేసింది.
అయితే, అప్రూవర్ అవుతామని పిటిషనర్లు పేర్కొన్నారని చెవిరెడ్డి తరపు న్యాయవాది తెలిపారు.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతున్న ఏ–2, ఏ–3 పిటిషనర్లు కోర్టులో అప్రూవర్స్‌గా మారవచ్చని తమ పిటిషన్‌లో పేర్కొనడంతో, ఇది చెవిరెడ్డికి సంబంధం ఉన్న విషయమని భావించి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ వేయడానికి న్యాయపరమైన హక్కు ఉందో లేదో తెలుసుకోవాలని కోర్టు నిర్ణయించింది. దాంతో కేసును వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది.