Karnataka Congress: సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం రేసులోకి కొత్త పేరు..

Dalit Groups Demand G Parameshwara As Karnataka Cm Amid Leadership Tussle

Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో హైడ్రామా కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల తర్వాత ఒప్పందం ప్రకారం, చెరో రెండున్నరేళ్లు సీఎం పీఠాన్ని పంచుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే, ఇప్పుడు రెండున్నరేళ్లు పూర్తి కావడంతో డీకే వర్గం సీఎం పోస్టును కోరుతోంది. దీంతో రెండు వర్గాలు కూడా తమ బాస్‌లకే సీఎం పదవి ఉండాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ హై కమాండ్ వద్దకు చేరింది.

Read Also: Cyclone Ditwah: దిత్వా తుఫాన్‌ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలు.. ఎల్లుండి ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..

ప్రస్తుతం, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం పోటీకి పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే, తాజాగా మరో పేరు కూడా సీఎం పోస్టు కోసం వినిపిస్తోంది. హోం మంత్రిగా ఉన్న జి. పరమేశ్వరను ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక తుమకూరులోని దళిత సంస్థలు శుక్రవారం నిరసన తెలిపాయి. దళిత నాయకుడైన పరమేశ్వరకు అత్యున్నత పదవిని ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ సీఎంను మార్చాలనుకుంటే నేను కూడా రేసులో ఉన్నానని గత వారం పరమేశ్వర అన్నారు.

అయితే, జి పరమేశ్వర సిద్ధరామయ్య వర్గానికి చెందిన వ్యక్తి. ఒక వేళ సీఎం పదవిని డీకేకు ఇవ్వాల్సి వస్తే, పరమేశ్వరను సీఎం చేయాలని సిద్ధరామయ్య వర్గం భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డీకేకు అత్యున్నత పదవి దక్కుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. బీజేపీ నేత, మాజీ సీఎం బస్వరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. సిద్ధరామయ్య, డీకేలు అహంకారంగా ఉన్నారని, ఇద్దరూ కూడా సీఎం పదవిపై వెనక్కి తగ్గే అవకాశం కనిపించడం లేదని, దీంతో కాంగ్రెస్ మరో వ్యక్తిని సీఎం చేసే అవకాశం ఉందని అంచనా వేశారు.