Akhanda 2 Pre Release: “నందమూరి బాలుడాయ… దొమ్మలేమో అదిరిపాయా” పాట వెనకాల కథ ఇదే..!

Akhanda 2 Pre Release Lyricist Kasarla Shyam Reveals Story Behind Nandamuri Baludaya Song

Akhanda 2 Pre Release: నేడు జరుగుతున్న ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ భావోద్వేగంతో మాట్లాడారు. నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానికి తగ్గట్టుగా తన అనుభవాలను పంచుకున్న ఆయన, ఈ చిత్రంలోని పాట ఎలా పుట్టిందో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. “నందమూరి నటసింహం అభిమానులందరికీ నమస్కారం. ‘అఖండ’లో ఒక రుద్ర తాండవం అవసరం అయితే.. మిగతా రచయితలకే ఇవ్వొచ్చు. కానీ, బాలయ్య బాబులో ఉన్న చిన్ని బాలకృష్ణుని బయటకు తీసే పని మాత్రం తానే చేయాలని.. ఆ బాధ్యత నాపై ఉంచినందుకు దర్శకుడికి నా కృతజ్ఞతలని అన్నారు.

Aadhaar: లైన్ లో నిలబడాల్సిన అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఫోన్ నంబర్‌ అప్‌డేట్ చేసుకోవచ్చు

ఈ సందర్భంగా ఆయన రాసిన లైన్‌ను గుర్తుచేసుకుంటూ.. “నందమూరి బాలుడాయ, అందమే చారెడాయ, వంద మందికి ఒక్కడయ, అల్లరే బోలెడాయ, దొమ్మలేమో అదిరిపాయా…’ అని ఈ పాట అదే భావంతో పుట్టిందని తెలిపారు. అయితే.. ‘దొమ్మలేమో అదిరిపాయా..’ అనే పదం ఎలా పుట్టిందో కూడా ఆయన వివరించారు. అఖండ రిలీజ్ తర్వాత ఒక అభిమాని రివ్యూలో ‘తమన్ బాలయ్య బాబుకు సంగీతం ఇస్తే దొమ్మలు అదిరిపోయాయి అన్నాడు’ అంతే… అక్కడినుంచే ఈ లైన్‌కి ఆలోచన వచ్చిందని అన్నారు. అభిమానుల ప్రేమే ఈ పదానికి మూలం” అని గుర్తుచేశారు.

Akhanda2 Pre-Release Event LIVE : ‘అఖండ-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఇక మరోవైపు దర్శకుడు బోయపాటి శ్రీను గురించి మాట్లాడుతూ.. “ఈ పాట అర్ధరాత్రి పుట్టింది. నేను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నా, బోయపాటి పాపం ఎంతో ఓపికతో ఒక గంటన్నర ఫోన్‌లో నాతోనే ఉండి ఈ పాట రాయించారు. సర్… మీ ఓపిక, మీ ప్రోత్సాహానికి ప్రత్యేక ధన్యవాదాలు” అని అన్నారు. ఇంకా తమన్ సంగీతం, బాలయ్య ఎనర్జీ, బోయపాటి మాస్ విజన్ కలిసినప్పుడు వచ్చే మాంత్రికత ఇదేనని శ్యామ్ పేర్కొన్నారు. ఇప్పుడు అఖండ 2లో కూడా బాలయ్య బాబూ మరోసారి రుద్రతాండవం చేయబోతున్నారని.. మనం అందరం థియేటర్‌లో చూసే రోజు కోసం ఎదురుచూడాలి అంటూ స్పీచ్‌ను ముగించారు.