
Akhanda 2: అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఫైట్ మాస్టర్ లక్ష్మణ్ భావోద్వేగంతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. తాము ఎన్నో ఆడియో ఫంక్షన్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు చూసినప్పటికీ.. అఖండ 2 ఈవెంట్ మాత్రం దేవాలయ వాతావరణాన్ని గుర్తు చేస్తున్నదని ఆయన అన్నారు. ఈ కాలంలో మనుషులు భక్తి నుండి దూరమవుతున్న తరుణంలో, ఇలాంటి సినిమాలు మళ్లీ ఆ భక్తిమార్గాన్ని చూపుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో బాలయ్య బాబు కేవలం నటుడు మాత్రమే కాదు.. శివశక్తి స్వయంగా నిలబడి ఉన్నట్టుగా అనిపించిందని, ఆ భావోద్వేగంతోనే ప్రతి ఫైట్‌ను డిజైన్ చేశామని వెల్లడించారు.
Akhanda 2: పవర్ఫుల్ యాక్షన్‌తో ‘అఖండ 2 తాండవం’ కొత్త టీజర్..
అలాగే అఖండ సినిమాలో ఉన్న రుద్రతాండవ స్థాయి ఎనర్జీని అఖండ 2లో మరింత పెంచేలా యాక్షన్ సీక్వెన్స్‌లను రూపొందించామని ఆయన అన్నారు. రెండు గంటలు థియేటర్లో సినిమా చూస్తున్నామనే భావం రాకుండా.. ఒక గుడిలోకి వెళ్లి భక్తి భావంలో మునిగిపోయిన అనుభూతి కలిగించేలా సినిమా తయారైందని లక్ష్మణ్ వివరించారు. చివరగా బోయపాటి శ్రీను, బాలయ్య బాబు, నిర్మాతలు, టెక్నీషియన్స్‌తో పాటు తనతో పనిచేసిన అసిస్టెంట్స్, శంకర్ మాస్టర్, ప్రకాష్, కెమెరామెన్ కమరన్ రామ ప్రసాద్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Akhanda 2 Pre Release: “నందమూరి బాలుడాయ… దొమ్మలేమో అదిరిపాయా” పాట వెనకాల కథ ఇదే..!