Akhanda 2: బోయపాటి ఎనర్జీ, బాలయ్య ప్యాషన్.. హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Akhanda 2 Actress Sanyuktha Menon Shares Emotional Speech On Balakrishna Shiva Devotion Boyapatis Energy

అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ అంగరంగా వైభవంగా జరిగింది. ఈ క్రమంలో సినిమాకు పనిచేసిన వారు వారి అనుభవాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే హీరోయిన్ సంయుక్త మీనన్ స్పీచ్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఆమె హీరో బాలకృష్ణ పట్ల ఉన్న గౌరవం, శివుడిపై తన భక్తి, సినిమా ప్రయాణంపై తన అనుభవాలను పంచుకుంది. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. మొదట బాలయ్య బాబుకు, ఆయన అభిమానులందరికీ నా నమస్కారం తెలిపింది. అలాగే మా టెక్నీషియన్స్, ఎంటైర్ క్రూ, తమన్, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.

Akhanda 2: పవర్‌ఫుల్ యాక్షన్‌తో ‘అఖండ 2 తాండవం’ కొత్త టీజర్..

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “తాండవం అంటే నాకు శివుడు. అది భక్తి కాదు, ప్రేమ. చిన్నప్పటి నుంచే శివుడిపై నాకు అపారం ప్రేమ ఉంది. సినిమా అయినా, నా వ్యక్తిగత జీవితం అయినా శివుడు ఎల్లప్పుడూ నా భాగమే” అని చెప్పుకొచ్చింది. ఇక అఖండ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన రోజున హీరో ధనుష్ కూడా సినిమా చూసి ఎంత ఎక్సైటయ్యాడో గుర్తు చేసింది. “అఘోరా పోర్షన్ గురించి ఆయన ఆగకుండా మాట్లాడాడు,” అని చెప్పింది. ఇక ఈ సినిమాలో తన పాత్ర చిన్నదైనా, పవర్ ఫుల్ అని తెలిపింది. ఫిబ్రవరిలో అఖండ తాండవం కోసం కాల్ రావడంతో, స్టోరీ వినక ముందే అంగీకరించానని.. టైటిల్, టీమ్ పేరే వింటేనే చేయాలి అనిపించిందని చెప్పింది.

ఇక దర్శకుడు బోయపాటి శ్రీను గురించి మాట్లాడుతూ.. ఆయన “యాక్షన్ అని చెప్పగానే ఆయన్నుంచి వచ్చే ఎనర్జీ మొత్తం టీమ్‌కి పాకిపోతుంది. కట్ అంటే కూడా అదే లెవెల్ ఎనర్జీ. ఆయనతో పని చేయడం అద్భుత అనుభవం” అని ప్రశంసలు కురిపించింది. ఇక ఆమె బాలయ్య గారి గురించి మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి లోనైంది. “బాలయ్య గారితో పని చేయడం మామూలు విషయం కాదు. ఆయన హ్యాపీ, ఎనర్జిటిక్, ఫుల్ ఆన్ ప్యాషన్. కేవలం సినిమా పట్లే కాదు… హిందూపురం పట్ల, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పట్ల ఆయన చూపే ప్రేమ, సేవాభావం అద్భుతం అని అన్నారు. మేమైతే మార్నింగ్ ఒక కాఫీ తాగి స్లోగా స్టార్ట్ అవుతాం. కానీ. బాలయ్య గారు.. ఉదయం 6-7 గంటలకు రెడీ అవుతారు. ఆ ఎనర్జీ మొత్తం టీమ్‌కి స్ప్రెడ్ అవుతుందని ఆమె చెప్పడం ప్రేక్షకుల్లో చప్పట్ల వర్షం కురిపించింది.

Akhanda 2: సినిమాకు కాదు… దేవాలయంకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది..!

ఇక మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ.. “తమన్ ఏ సీన్‌కి మ్యూజిక్ ఇచ్చినా.. దాన్ని ఇంకో లెవెల్‌కి తీసుకెళ్తాడు. అఖండ అంటే తమన్ మ్యూజిక్ అనేది సెలబ్రేషన్” అని ఆమె పేర్కొంది. ఇక “జాజికాయ సాంగ్‌లో నేను డాన్స్ చేశాను.. భయం వేసింది కానీ బాలయ్య గారు నాకు బలం ఇచ్చారని తెలుపుతూ.. బాలయ్య బాబు ‘జస్ట్ డీప్ బ్రెత్… హావ్ ఫన్… సినిమా ఎంజాయ్ చేయి’ అని చెప్పడంతో నాకెంతో కాన్ఫిడెన్స్ వచ్చింది” అని తెలిపింది. ఇక చివరగా.. “ఈ సినిమా కేవలం మాస్ ఎంటర్టైన్మెంట్ కాదు.. ఇది ఎన్లైటెన్మెంట్ కూడా.. అఖండ తాండవం అలా ఉంటుంది.. అద్భుతంగా, ఆధ్యాత్మికంగా, ఎనర్జీతో నిండిపోయి” ఉందని చెప్పింది.