
Akhanda 2 Balakrishna: అఖండ 2 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ వేదికగా జన సంద్రోహంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్, భారీ ఎత్తున నందమూరి అభిమానులు పాల్గొన్నారు. ఈ వేదికగా హీరో నందమూరి బాలకృష్ణ సినిమాకు సంబంధించి అనేక విషయాలను తెలిపారు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తు చేస్తూ వారితో జరిగిన అనుభవాన్ని తెలుపుతూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంలోని హీరో బాలకృష్ణ సినిమా కథ ఇదే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Akhanda 2: బాలయ్య మా బలం, మా శక్తి, మా ఆస్తి: బోయపాటి శ్రీను
ఈ సినిమాలోని రుద్ర తాండవ విన్యాసం నాలో ఆవేశమై, అలాగే ఆ త్రినేత్రుడి వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై, నాగ బంధన భయంకరమైన క్రోదం నా ఉచ్ఛ్వాసనిచ్వాసలై.. ఇంకా ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి సౌర్యమై ఎలా ఉంటుందో నా పాత్ర అలా ఉంటుంది అంటూ తెలియజేశారు. ఇంతకంటే తాను సినిమా గురించి ఏమి చెప్పనని తెలిపారు.
Akhanda 2: బోయపాటి ఎనర్జీ, బాలయ్య ప్యాషన్.. హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!