Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. నేడు సిద్ధరామయ్య, శివకుమార్ భేటీ..!

Karnataka Leadership Change Siddaramaiah Dk Shivakumar Breakfast Meeting

Karnataka: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ శనివారం ఉదయం 9:30 గంటలకు ముఖ్యమంత్రి నివాసం కావేరిలో అల్పాహార విందుకు హాజరుకానున్నారు. పార్టీ హైకమాండ్ సూచనల మేరకు ఈ సమావేశం జరుగుతోంది.

READ MORE: Maoist Leaders Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ.. ఇద్దరు కీలక సభ్యులు లొంగుబాటు..

ఇదిలా ఉండగా, హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం స్పష్టం చేశారు. నేడు ఉదయం ఈ విషయంపై చర్చించడానికి హైకమాండ్ తనను, శివకుమార్‌ను భేటీ కావాలని కోరినట్లు తెలిపారు ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. “నేను నా వైఖరికి కట్టుబడి ఉన్నాను. పార్టీ సీనియర్ల సూచనల మేరకు నేను నడుచుకుంటానని ఇప్పటికే చెప్పాను. రేపు కూడా అదే చెబుతాను. పార్టీ సీనియర్ నాయకులు నన్ను, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ను పిలిపించి కలవమని ఆదేశించారు. అందువల్ల నేను ఆయనను భోజనానికి ఆహ్వానించాను. అక్కడ మేము తదుపరి అంశంపై చర్చించుకుంటాం. హైకమాండ్ సూచనలను అంగీకరిస్తానని డి.కె. శివకుమార్ కూడా చెప్పారు. హైకమాండ్ నన్ను న్యూఢిల్లీకి పిలిస్తే, నేను వెళ్తాను.” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఇద్దరు నాయకులు నేడు ఉదయం 9:30 గంటలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక నివాసం “కావేరి”లో సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం ఏం జరగనుంది? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

READ MORE: Pawan Kalyan : పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై పార్టీ ఎంపీలకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు