
Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ మలుపు వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.. ఫార్చూనర్ కారు – మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారులో ఉన్న ఐదుగురు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఫార్చూనర్ కారు ఆదోనికి వెళ్తుండగా వేగంగా వెల్తూ స్విఫ్ట్ కారును ఢీకొట్టినట్టు చెబుతున్నారు.. అయితే, బాధితులు కర్ణాటకకు చెందినవారిగా చెబుతున్నారు.. కర్ణాటక నుంచి మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనానికి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది.. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ఎవరిది తప్పు? అనే పూర్తి సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది.. కాగా, ఈ మధ్య వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న బస్సు ప్రమాదం తర్వాత.. వరుసగా ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి..
Read Also: Maoist Leaders Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ.. ఇద్దరు కీలక సభ్యులు లొంగుబాటు..