
Bengaluru Airport: బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుకున్నారు. ఏకంగా రూ. 200 కోట్ల విలువ చేసే 273 కేజీల గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. నలుగురు విదేశీయులతో పాటు 32 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ నవంబర్ మాసంతో అత్యధికంగా గంజాయి పట్టుబడినట్లు తెలిపారు. ఈ నెల మొదటి వారంలోనే రూ. 94 కోట్ల విలువ చేసే 94 కేజీల గంజాయి సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి బెంగుళూరు చేరుకున్న 4 గురు విదేశీయుల వద్ద గంజాయి గుర్తించారు. ఎనర్జీ డ్రింగ్ టిన్స్ లో గంజాయి నింపి యథావిథిగా ప్యాకింగ్ చేశారు. కస్టమ్స్ అధికారులు ఏమాత్రం అనుమానం రాకుండా చాలా జాత్రత్త పడ్డారు స్మగ్లర్స్.. ఎయిర్ పోర్టు లో వీరి వ్యవహారశైలీలో అనుమానం రావడంతో అదుపులోకి తీసుకోని తమదైన స్టైల్‌లో విచారణ చేపట్టారు. ఎనర్జీ డ్రింగ్ లో దాచిన గంజాయి గుట్టు రట్టైంది.
READ MORE: Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కార్లు ఢీ, ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి
ఇలా వివిధ మార్గాల ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేశారు కేటుగాళ్లు. బ్యాంకాక్ దేశం అడ్డగా గంజాయి స్మగ్లింగ్ కొనసాగుతోంది. మూడు పువ్వులు ఆరు కాయలుగా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతోంది. డ్రగ్స్ కు బదులు విదేశీ గంజాయి స్మగ్లింగ్ పై స్మగ్లర్స్ ముఠా దృష్టి సారించింది. కస్టమ్స్ అధికారులకు చిక్కకుండా కొత్త కొత్త పద్దతులు ఉపయోగించారు. గంజాయిని ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో ప్రత్యేకంగా ఓ స్థావరం ఏర్పాటు చేసి అందులో దాచి తరసిస్తున్నారు. చూస్తే ట్రాలీ బ్యాగ్ ఎటు చూసి ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా కొట్ల రూపాయల విలువ చేసే గంజాయి స్మగ్లింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. భారత దేశంలో ఉన్న యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తూ వారి జీవితాలు నాశనం చేస్తున్నారు. రేపటి పౌరులుగా మారాల్సిన యువతకు మాదకద్రవ్యాల ఆశ చూపుతున్నారు కొంత మంది గ్యాంగ్ సభ్యులు.. కేవలం విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, బడా బాబుల పిల్లలను టార్గేట్ చేశారు. పోలీసలు ఎంత కట్టడి చేసినా యథేచ్ఛగా మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కొనసాగిస్తున్నారు.
READ MORE: Hyderabad: కొడుకు, అల్లుడితో కలిసి భర్తను లేపేసిన భార్య.. కారణం ఏంటంటే..?