
A320 ఎయిర్‌బస్ విమానాల్లో సాఫ్ట్‌వేర్ సమస్య తలెత్తింది. దీంతో ఇండిగో, ఎయిరిండియా విమాన రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా ఆ సంస్థలు తెలిపాయి. తీవ్రమైన సౌర వికిరణం కారణంగా A320 కుటుంబ విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లుగా పేర్కొన్నాయి. విమాన నియంత్రణకు కీలకమైన డేటాను పాడు చేయడంతో ఈ సమస్య తలెత్తింది. దీంతో అవసరమైన సాఫ్ట్‌వేర్ మార్పులు చేయాల్సిన కారణాన రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఉంటుందని ఇండిగో, ఎయిరిండియా ఎయిర్‌బస్ వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Off The Record : బైపోల్ వార్ కోసం బీఆర్ఎస్ కొత్త అస్త్రాలు..? స్టేషన్ ఘన్ పూర్ మీద స్పెషల్ ఫోకస్
సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా దాదాపు 200 నుంచి 250 విమానాల్లో తీవ్ర అంతరాయం ఉంటుందని వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు 560 A320 కుటుంబ విమానాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటిలో 200-250 వరకు సాఫ్ట్‌వేర్ మార్పులు లేదా హార్డ్‌వేర్ రీఅలైన్‌మెంట్ అవసరమైనట్లుగా వర్గాలు పేర్కొ్న్నాయి. ప్రభావిత విమానాల్లో ఎలివేటర్ ఐలెరాన్ కంప్యూటర్ (ELAC)ను ఇన్‌స్టాల్ చేయాలని ఎయిర్‌బస్ విమానయాన ఆపరేటర్లకు యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) సూచించింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ మార్పులకు పూనుకున్నారు. అయితే ముందస్తు ప్రయాణాలు ఉన్నవాళ్లు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Off The Record: అనంతపురం పాలిటిక్స్‌లో బాహుబలి కేరక్టర్స్.. ఇన్నాళ్ళు కట్టప్పలు కామనైపోగా…
ప్రస్తుతం A320 విమానాల్లో సాఫ్ట్‌వేర్/హార్డ్‌వేర్ రీఅలైన్‌మెంట్ జరుగుతుందని.. దీని కారణాన షెడ్యూల్ సమయాల్లో అంతరాయం ఉంటుందని ఎయిరిండియా ఎక్స్‌లో ప్రయాణికులు సమాచారం తెలియజేసింది. అలాగే ఇండిగో విమాన సంస్థ కూడా సమాచారం తెలియజేసింది. భద్రతా, పూర్తి శ్రద్ధ, జాగ్రత్తతో విమానాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో సాఫ్ట్‌వేర్ మార్పులు చేయాల్సి వస్తుందని.. కొన్ని విమానాల్లో స్వల్ప షెడ్యూల్ మార్పులు ఉండవచ్చని.. దయచేసి ఎయిర్‌పోర్టులకు వెళ్లే ముందు యాప్ లేదా వెబ్‌సైట్‌లో సమాచారం తెలుసుకోవాలని ప్రయాణికులకు ఇండిగో విజ్ఞప్తి చేసింది.
Air India tweets, “We are aware of a directive from Airbus related to its A320 family aircraft currently in-service across airline operators. This will result in a software/hardware realignment on a part of our fleet, leading to longer turnaround time and delays to our scheduled… pic.twitter.com/drkc9JPLcF
— ANI (@ANI) November 29, 2025
IndiGo tweets, “Airbus has issued a technical advisory for the global A320 fleet. We are proactively completing the mandated updates on our aircraft with full diligence and care, in line with all safety protocols. While we work through these precautionary updates, some flights… pic.twitter.com/XciHvXGMFn
— ANI (@ANI) November 29, 2025