
మాస్ జాతర : రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో భాను భోగవరపు తెరకెక్కించిన మాస్ జాతర భారీ అంచనాల మధ్య నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాని, ఊహించని రేంజ్ లో డిజాస్టర్ రిజల్ట్ ఎదురైంది. ఈనెల 28 నుంచి నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది
శశివదనే పలాస ఫేమ్ రక్షిత్, కోమలి జంటగా, గోదావరి అందాలు బ్యాక్ డ్రాప్ లో, ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమా శశివదనే, అక్టోబర్ 10న రిలీజ్ అయిన ఈ సినిమాకు థియేటర్ లో ఆదరణ దక్కలేదు. ఈనెల 28 నుంచి సన్ నెక్ట్స్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కి కు రాగా మంచి రెస్పాన్స్ రాబడుతోంది.
ఆర్యన్ : తమిళ హీరో విశ్ణు విశాల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ సినిమా తమిళంలో అక్టోబర్ 31న విడుదల కాగా, తెలుగులో నవంబర్ 7న రిలీజ్ అయ్యింది. థియేటర్లలో పెద్ద గా సక్సెస్ సాధించలేకపోయింది. దాంతో తొందరగా థియేటర్స్ లోంచి ఎత్తేశారు. ఈ నెల 28 నుండి నెట్ఫ్లిక్స్లో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కు రాగా మంచి వ్యూస్ రాబడుతున్నాయి.
సన్నీ సంస్కారి కి తులసి కుమారి : జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, సన్యా మల్హోత్రా, రోహిత్ శరీఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడి బాలీవుడ్ సినిమా సన్నీ సంస్కారి కి తులసి కుమారి, థియేటర్లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ నెల 27న ఓటీటీలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.