
Ditwah Cyclone: తుఫాన్ కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. మొదట, సెన్యార్ తుఫాను, ఇప్పుడు దిత్వా తుఫాను కలకలం సృష్టిస్తోంది. ఈ తుఫాను ఇప్పటికే శ్రీలంకలో విధ్వంసం సృష్టించింది. తాజాగా భారతదేశం వైపు కదులుతోంది. ఈరోజు భారత భూభాగాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలకు భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేయబడింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. భారీ వర్షపాతం అంచనా వేస్తూ వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తమిళనాడులోని 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రామేశ్వరం, పుదుచ్చేరి లో వర్షాలు దంచి కోడుతున్నాయి.తంజావూరు, తిరువారూర్, మైలాడుదురై, విల్లుపురం, కడలూరు, కళ్లకురుచ్చిలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తంజావూరు, తిరువారూర్లో పలుగ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. తూత్తుకుడిలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
READ MORE: Rashi Khanna: నా కంఫర్ట్ జోన్ దాటి దిగజారిపోయే పాత్రలు నాకొద్దు..
ఇటీవల శ్రీలంకలో దిత్వా తుఫాను విధ్వంసం సృష్టించింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 69 మంది మరణించినట్లు సమాచారం. డజన్ల కొద్దీ జనాలు ఇప్పటికీ కనిపించడం లేదు. భారత ప్రభుత్వం ఆపరేషన్ సాగర్ బంధు కింద పొరుగు దేశానికి తక్షణ సహాయాన్ని పంపింది. మరోవైపు.. ఈ తుఫాన్ శనివారం మధ్యాహ్నం నాటికి భారత భూభాగంలోకి పూర్తిగా ప్రవేశిస్తుందని భావిస్తున్నారు. తుఫాను నేరుగా భారత తీరాన్ని తాకదని, కానీ ముందుకు కదులుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
READ MORE: Bihar: “గో మాంసం తినిపించారు.. కల్మా, నమాజ్ చదివించారు”.. బలవంతంగా మతం మారిన మహిళ కథ..
ఇంతలో రాబోయే కొన్ని రోజులు దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతల గురించి వాతావరణ శాఖ తాజా సూచనను జారీ చేసింది. పలు ప్రాంతాల్లో క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తగ్గుదల ఉంటుందని అంచనా. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోయాయి. తాజా వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. వాయువ్య భారత్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.