
మూడోరోజు ఐబొమ్మ రవి కస్టడీ కొనసాగుతుంది. మొన్న చంచల్ గూడా జైలు నుండి రవిని సీసీఎస్ కు తీసుకొచ్చిన పోలీసులు. మొదటిరోజు విచారణలో ఎన్జిలా నెట్వర్క్, ఆర్థిక వ్యవహారాలపై కీలకమైన సమాచారం సంపాదించారు పోలీసులు. ఐపి మాస్క్ చేసి అనధికారిక వెబ్ సైట్స్ నిర్వహిస్తు సినిమాలను పైరసీ చేస్తున్నాయి ముఠాలు. ఐపి మాస్క్ వ్యవహారంపై రవిని అరా తీశారు సైబర్ క్రైమ్ పోలీసులు. పోర్న్ వెబ్ సైట్స్, పైరసీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వెబ్సైట్స్ సైతం క్లోస్ చెయ్యాలని చూస్తున్నారు పోలీసులు. యాడ్ బుల్ యాప్ నిర్వహించడానికి గలా కారణాలపై రవిని విచారించి కీలక లీడ్ సంపాదించారు పోలీసులు. అనధికార గేమింగ్, ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఐబొమ్మ రవి కోట్లు గడించినట్లు గుర్తించారు పోలీసులు.
Also Read : Akhanda2 : నటన అంటే నవ్వడమో.. కన్నీళ్లు తెప్పించడమో కాదు : నందమూరి బాలకృష్ణ
రెండవ రోజు విచారణలో భాగంగా రవి ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు విషయాలపై మళ్ళీ ప్రశ్నించారు పోలీసులు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కోట్ల రూపాయాల బ్యాంకు ట్రాన్సక్షన్ ను రవి ముందుంచి ప్రశ్నించగా పోలీసుల విచారణకు ఏ మాత్రం రవి సహకరించలేదు. పోలీసుల ప్రశ్నలకు రవి ఒక్క సమాధానం చెప్పలేదు. ఇక నేడు విచారణ చివరి రోజు కావడంతో ఎలాగైన రవి నుండి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేయనున్నారు పోలీసులు. రవి నోరు విప్పితే అసలు ఈ నెట్ వర్క్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఇంకా సర్వర్లు ఉన్నాయి. కోట్ల రూపాయల డబ్బు ఎలా చేతులు మారింది వంటి విషయాలపై క్లారీటి వస్తుంది. ఇక నేటితో కస్టడీ ముగియనుండడంతో సాయంత్రం నాంపల్లి కోర్టులో రవిని హాజరుపర్చనున్న సైబర్ క్రైమ్ పోలీసులు.