
హాంకాంగ్ చరిత్రలోనే ఊహించని రీతిలో ఘోరం జరిగిపోయింది. అనేక కుటుంబాల్లో అగ్నిప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. బుధవారం సాయంత్రం హాంకాంగ్ బహుళ అపార్ట్మెంట్లలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందలాది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. తమ వారి జాడ కోసం రక్తసంబంధికులు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. మృతదేహాలు కాలిపోవడంతో గుర్తుపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకొందరు క్షేమంగా రావాలంటూ ఎదురుచూస్తూ కన్నీళ్లు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Udaipur Wedding: వెలుగులోకి కళ్లు బైర్లు కమ్మే విషయాలు.. ఈడీ అదుపులో ర్యాపిడో డ్రైవర్!
ఇక అగ్నిప్రమాదం తర్వాత అధికారులు రంగంలోకి దిగారు. ప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తుండగా కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. అపార్ట్మెంట్ మరమ్మతుల కోసం రక్షణ వలయంగా పెద్ద ఎత్తున కలప ఏర్పాటు చేశారు. ఆ సెంట్రింగ్పై ఒక కార్మికుడు ప్రమాదకర స్థితిలో సిగరెట్ తాగుతూ కనిపించాడు. సిగరెట్ తాగి అక్కడే పడేయడంతో నెమ్మది నెమ్మదిగా మంటలు అంటున్నాయి. వెదురు స్కాఫోల్డింగ్, మండే ఫోమ్ బోర్డుల కారణంగా వెంటనే వేగంగా మంటలు వ్యాపించినట్లుగా అధికారులు ప్రాథమికంగా కనిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సిగరెట్ కారణంగానే మంటలు అంటుకున్న విషయాన్ని అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు.
Hong Kong
Apparently, the fire was caused by cigarettes.pic.twitter.com/L4qxcI2168
— ダリル【Daryl Dixon】 (@dead1978tt) November 28, 2025

.