Karnataka: సిద్ధరామయ్య ఇంట్లో డీకే.శివకుమార్ కీలక భేటీ.. పవర్ షేర్‌పై చర్చ!

Dk Shivakumar Meets Siddarmaiah For Breakfast In Karnataka

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ షేరింగ్‌పై కొద్దిరోజులుగా ఫైటింగ్ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడి ఇటీవల రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో పవర్ షేర్ చేయాల్సింది డీకే.శివకుమార్ వర్గం మొండిపట్టుపట్టింది. హస్తిన వేదికగా సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గాలు హైకమాండ్‌తో మంతనాలు జరిపాయి.

ఇది కూడా చదవండి: Hong kong Fire: హాంకాంగ్‌ విషాదం వెనుక దిగ్భ్రాంతికర విషయాలు.. ఓ కార్మికుడు ఏం చేశాడంటే..!

తాజాగా డీకే.శివకుమార్‌ను సిద్ధరామయ్య బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించారు. దీంతో శనివారం బెంగళూరులోని సిద్ధరామయ్య నివాసానికి డీకే.శివకుమార్ వచ్చారు. ఇద్దరూ కలిసి అల్పాహారం తీసుకున్నారు. ముఖ్యమంత్రి న్యాయ సలహాదారు ఎఎస్ పొన్నన్న కూడా హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: Udaipur Wedding: వెలుగులోకి కళ్లు బైర్లు కమ్మే విషయాలు.. ఈడీ అదుపులో ర్యాపిడో డ్రైవర్‌‌!

ఇదిలా ఉండగా హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం స్పష్టం చేశారు. ఇక హైకమాండ్ సూచనలను అంగీకరిస్తానని డీకే.శివకుమార్ కూడా చెప్పారు. ‘‘హైకమాండ్ నన్ను న్యూఢిల్లీకి పిలిస్తే నేను వెళ్తాను.” అని ట్వీట్‌లో డీకే.శివకుమార్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శనివారం మధ్యాహ్నం డీకే.శివకుమార్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.