Fire Breaks Out at Vizag KGH : విశాఖ కేజీహెచ్‌లో అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన పేషెంట్లు..!

Fire Breaks Out At Visakhapatnam Kgh Hospital 45 Patients Evacuated Safely

Fire Breaks Out at Vizag KGH : విశాఖ కేజీహెచ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. అయితే, సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది.. గుండె జబ్బుల విభాగంలో ఒక్కసారిగా దట్టంగా పొగలు అలుముకున్నాయి.. దీంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు పేషెంట్లు… ఉదయం ఆఫీస్ రూమ్ లో ఏసీ నుంచి మంటలు, దట్టమైన పొగ వెలువడ్డాయి.. సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.. .ప్రమాదానికి గల ప్రాథమిక కారణం షార్ట్ సర్క్యూట్ గానే భావిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది… ప్రమాద సమయంలో 45 మంది పేషెంట్లు ఉన్నారని తెలిపారు కేజీహెచ్ సూపరిండెంట్.. హుటాహుటిన వేరే బ్లాక్ కు పేషంట్లను తరలించి రక్షించారు.. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు పేషెంట్లు.. వైద్యులు, సిబ్బంది.. కేజీహెచ్ లో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై ఆందోళన చెందుతున్నారు రోగులు..

Read Also: Gold Rates: వామ్మో.. మగువలకు బిగ్ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!