Siddarmaiah: అంతా మీడియా సృష్టే.. డీకేతో విభేదాలు లేవన్న సిద్ధరామయ్య

Dk Shivakumar Meets Siddarmaiah For Breakfast In Karnataka 2

మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్దాలేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. శనివారం ఉదయం బెంగళూరులోని సిద్ధరామయ్య నివాసంలో డీకే.శివకుమార్ బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అనంతరం ఇద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.. డీకే.శివకుమార్‌తో విభేదాలు ఉన్నట్లుగా వస్తున్న వార్తలు బీజేపీ, జేడీఎస్, మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. భవిష్యత్‌లోనూ ఉండబోవని సిద్ధరామయ్య వెల్లడించారు. 2028లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు. హైకమాండ్ సూచన మేరకే ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: MS Dhoni: పెళ్లంటే నిప్పుతో చెలగాటమే.. కొత్త జంటతో ధోని చమత్కారం!

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ షేరింగ్‌పై కొద్దిరోజులుగా ఫైటింగ్ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడి ఇటీవల రెండున్నరేళ్ల వేడుక చేసుకుంది. అప్పటి నుంచే రగడ మొదలైంది. పవర్ షేర్ చేయాల్సిందేనని డీకే.శివకుమార్ వర్గం మొండిపట్టుపట్టింది. హస్తిన వేదికగా సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గాలు హైకమాండ్‌తో మంతనాలు జరిపాయి. అయితే తాజా పరిణామాలను చూస్తుంటే.. పవర్ షేర్‌గా సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం డీకే.శివకుమార్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఖాయంగా తెలుస్తోంది. ఈ సస్పెన్ష్‌కు మరికొన్ని గంటల్లో ఫుల్‌స్టాప్ పడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Hong kong Fire: హాంకాంగ్‌ విషాదం వెనుక దిగ్భ్రాంతికర విషయాలు.. ఓ కార్మికుడు ఏం చేశాడంటే..!