
అమరన్ సినిమాతో ఒక్కసారిగా కోలీవుడ్ లో రాజ్ కుమార్ పెరియసామి పేరు మారుమోగింది. అమరన్ తో శివకార్తీకేయన్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు రాజ్ కుమార్ పెరియసామి. ప్రస్తుతం ధనుష్ హీరోగా సినిమా చేస్తున్నాడు రాజ్ కుమార్. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అమరన్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. గ్రాండ్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ కు ఇటీవల బ్రేక్ పడింది. తానూ ఈ చిత్రాన్ని నిర్మించలేనని నిర్మాత మధురై అన్బు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.
Also Read : I – Bomma Ravi : మూడో రోజు ఐబొమ్మ రవి కస్టడీ.. పోలిసులకు సహకరించని రవి
ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 160 కోట్ల వరకు అవుతుందట. ముఖ్య పాత్ర పోషిస్తున్న ముమ్మట్టి రెమ్యునరేషన్ కింద రూ. 24 కోట్లు తీసుకున్నారట. మిగిలిన అందరి రెమ్యునరేషన్స్ అన్ని కలిపి బడ్జెట్ చాలా అవుతుందని రిస్క్ చేయలేక నిర్మాత మధురై అన్బు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట. సినిమా ఫైనాన్షియర్‌గా పనిచేసే మధురై అన్బు ధనుష్ తో సినిమా చేయాలని భావించి ఓవర్ బడ్జెట్ కారణంగా మధ్యలోనే వదిలేసాడు. అన్బు తప్పుకోవడంతో ఈ సినిమా ఇక ఆగిపోతుందని అందరు భావిస్తున్న టైమ్ లో హీరో ధనుష్ తానే స్వయంగా నిర్మించేందుకు రంగంలోకి దిగాడు. తన స్వీయ నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలిమ్స్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ధనుష్ కు తోడుగా వెంటనే, కమల్ హాసన్ నిర్మాణ సంస్థ RKFI ఈ చిత్రాన్ని నిర్మించడానికి అంగీకరించింది. అమరన్ ను కూడా RKFI నిర్మించింది. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి పై నమ్మకంతో ధనుష్, కమల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.