
Heart Attack Early Signs: ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో చిన్న చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు ప్రారంభ సంకేతాలు చాలా సార్లు కేవలం ఛాతీ నొప్పితోనే కాకుండా చేతుల్లో లాగుడు, దవడవైపు వ్యాపించే నొప్పి, ఆకస్మికంగా వచ్చే చెమటలు, శ్వాసలో ఇబ్బంది రూపంలో కనిపిస్తాయి. ఇలాంటి సంకేతాలు వస్తే భయంతో గందరగోళానికి గురికావొద్దు. తక్షణ ఉపశమనం అందించే నైట్రేట్ ఆధారిత మందులు నాలుక క్రింద ఉంచితే రక్తనాళాలు సడలిపోతాయని గుండెపై ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
READ MORE: D55: ధనుష్ తో ఆగిన అమరన్ దర్శకుడి సినిమా.. రంగంలోకి దిగిన స్టార్ హీరో
ఈ నొప్పి 20 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంటే వెంటనే అనుమానించాలి. అయితే ఇలాంటి నొప్పి మొదటిసారిగా శ్వాస తీసుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉందో? లేదో? అనే విషయాన్ని గమనించాలి. ఈ సమయంలో బాధితుడు అస్సలు భయపడకూడదు. ముందుగా సార్బిట్రేట్(5 ఎంజీ నుంచి 10 ఎంజీ) ట్యాబ్లెట్ ను నాలుక కింద పెట్టుకుని చప్పరించాలట. ఈ మెడిసిన్‌ని ఉంచడంతో అది కరిగిపోతుందట. అక్కడ ఉన్న కణజాలం ద్వారా రక్తంలోకి కలిసిపోతుందట. దీనిలో ఐసోసోర్బైడ్ డైనిట్రేట్ నైట్రేట్లు అనే ఔషధాల సమూహం ఉంటుంది. ఐసోసోర్బైడ్ డైనిట్రేట్ రక్త నాళాలను పెద్దదిగా చేస్తుంది (విస్తరిస్తుంది). దీని వలన రక్తం ద్వారా రక్తం ప్రవహించడం సులభం అవుతుంది. గుండె రక్తం పంప్ చేయడం సులభం అవుతుంది. ఇది గుండె మీద ఒత్తిడి తగ్గిస్తుందట. వైద్యుల సూచనల మేరకు ఈ మందులు మీ ఇంట్లో ఉంచుకోవడం మంచిది.
READ MORE: Avian Influenza :దేశంలోకి కొత్త రకం వైరస్..ఏవియన్ ఇన్ఫ్లుఎంజా గురించి తెలుసా..
అంతేకాదు.. నిజమైన ప్రమాదం మొదటి హార్ట్ ఎటాక్ తర్వాతే ప్రారంభమవుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. సరైన మందులు, సరైన సమయానికి వాడకపోతే రెండోసారి ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా స్వీడన్, బ్రిటన్ పరిశోధకులు కలిసి చేసిన విశ్లేషణలో మొదటి ఎటాక్ తర్వాత వెంటనే కొలెస్ట్రాల్ నియంత్రణ మందులు ప్రారంభించినవారిలో రికవరీ చాలా మెరుగ్గా ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా స్టాటిన్స్, ఎజెటిమైబ్ అనే రెండు ఔషధాలను ఒకేసారి వాడితే గుండె నాళాల్లో పూడిక సమస్య వేగంగా తగ్గిపోతుందని, తద్వారా రెండో హార్ట్ ఎటాక్‌ను గణనీయంగా అడ్డుకోవచ్చని రీసెర్చ్‌లో స్పష్టంగా వెల్లడైంది. ఈ రెండు మందులు చెడు కొవ్వు పరిమాణాన్ని లోపల నుంచి తగ్గించడమే కాకుండా, ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొలెస్ట్రాల్‌ను కూడా నిరోధిస్తాయి. ఒకటి కాలేయంలో కొలెస్ట్రాల్ నిర్మాణాన్ని ఆపగా, మరొకటి జీర్ణవ్యవస్థలో శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది. ఈ డబుల్ చర్య వల్ల రక్తనాళాలు సులభంగా మూసుకుపోవు, గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. వేలాది మంది రోగులపై ఏడు సంవత్సరాలపాటు పరిశీలించిన ఈ అధ్యయనం, హార్ట్ ఎటాక్ నుంచి బయటపడినవారికి ఇదే అత్యంత ప్రభావవంతమైన కాంబినేషన్ ట్రీట్మెంట్గా నిలిచింది.