
మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయులు పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాశ్మీరీ వెల్లుల్లి ఎంతో ఉపయోగకరమని కొంతమంది పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, ముఖ్యంగా జంక్ ఫుడ్ సేవనం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడమే. ఈ సమస్యతో బాధపడేవారికి పోషకాహార నిపుణురాలు శ్వేతా షా ఒక సులభమైన స్వదేశీ పరిష్కారాన్ని సూచించారు.
ఆమె చెప్పిన ప్రకారం, స్టాటిన్‌ల వంటి మందులకు ప్రత్యామ్నాయంగా కాశ్మీరీ వెల్లుల్లిని ప్రయోగించవచ్చు. దీనిని హిమాలయన్ వెల్లుల్లి లేదా జమ్మూ వెల్లుల్లి అని కూడా పిలుస్తారు. ఇది అరుదైన జాతికి చెందుతుంది; సాధారణ వెల్లుల్లితో పోలిస్తే చిన్నదిగా ఉండి నారింజ-పసుపు రంగులో కనిపిస్తుంది.
కాశ్మీరీ వెల్లుల్లి తీసుకునే విధానం
రోజుకు 4–5 కాశ్మీరీ వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి ఖాళీ కడుపుతో నెమ్మదిగా నమలాలి. నమలడం కష్టమైతే, వాటిని ఉడికించి కషాయం రూపంలో తాగినా ప్రయోజనం ఉంటుంది. తీసుకున్న తర్వాత ఒక గంట పాటు ఏదీ తినకూడదు, తాగకూడదు.
ఉపయోగాలు
కాశ్మీరీ వెల్లుల్లి సేవించడం వల్ల HDL (మంచి కొలెస్ట్రాల్) స్థాయి పెరుగుతుందని న్యూట్రిషియన్ శ్వేతా షా వెల్లడించారు. LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయి తగ్గుతుందన్నారు. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గడంలో సహాయం చేస్తుందని ఆమె వెల్లడించారు.
గమనిక
ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సంకలనం చేయబడింది. ఎటువంటి ఇంటి నివారణలు లేదా సప్లిమెంట్లు ప్రయత్నించే ముందు తప్పనిసరిగా అనుభవజ్ఞుడైన పోషకాహార నిపుణుడిని లేదా వైద్యులను సంప్రదించి తరువాతే నిర్ణయం తీసుకోవాలి.