
నెల్లూరులో సీపీఎం నేత దారణ హత్య.. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై నిందితుల దాడి..
నెల్లూరులోని కల్లూరిపల్లిలో RDT కాలనీలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్డీటీ కాలని గంజాయి కి అడ్డాగా మారింది.. దీంతో సీపీఎం కార్యకర్తగా ఉన్న పెంచలయ్య.. గంజాయి కి వ్యతిరేకంగా పోలీసులను కలుపుకొని అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వ్యవహారం గంజాయి బ్యాచ్ కి నచ్చలేదు. దీంతో అతనికి ఎలాగైనా స్పాట్ పెట్టాలని భావించారు. గంజాయి సప్లయర్ గా ఉన్న ఓ మహిళ ఆధ్వర్యంలో పెంచలయ్యను చంపేందుకు రిక్కీ నిర్వహించారు. నిన్న కొడుకును స్కూల్ నుంచి తీసుకొస్తుండగా.. హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆర్చి వద్ద కాపు గాసిన తొమ్మిది మంది గంజాయి బ్యాచ్.. పెంచలయ్య పై కత్తులతో విరుచుకుపడ్డారు. 9 మంది అతనిపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. స్థానికులు పెంచలైన ప్రభుత్వాసుపత్రికి తరలించే లోపే ఆయన మృతి చెందాడు. ఈ విషయంపై పోలీసులు కూడా స్పందించారు. పెంచలేను హత్య చేసింది గంజాయి బ్యాచ్ అంటూ ప్రకటించారు. నిందితుల కోసం వేట ప్రారంభించిన పోలీసులు.. తెల్లవారుజాము సమయంలో నిందితుడు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నారని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లారు. నిందితుల కోసం గాలిస్తున్న క్రమంలో జేమ్స్ అనే నిందితుడు కనిపించడంతో అతని పట్టుకోబోయారు. అతను పోలీసులపై కత్తితో దాడి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆదినారాయణ అనే కానిస్టేబుల్ కి గాయం అయింది. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జేమ్స్ మోకాలికి గాయమైంది.. మిగిలిన నిందితులు పరారయ్యారు. గాయపడిన జేమ్స్ తో పాటు కానిస్టేబుల్ ఆదినారాయణ పోలీసులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏపీలో మావోయిస్టుల కలకలం.. ఛత్తీస్‌గఢ్ పోలీసుల కూంబింగ్..
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మవోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా కీలక నేతల ఎన్కౌంటర్.. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మావోయిస్టుల అరెస్ట్‌లు చర్చగా మారగా.. ఇప్పుడు మరోసారి ఏపీలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి.. నంద్యాల జిల్లాలో అకస్మాత్తుగా సెక్యూరిటీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొలిమిగుండ్ల మండలంలోని ఎర్రమల కొండ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో ఛత్తీస్‌గఢ్ పోలీసులు భారీ స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ‘కగార్ ఆపరేషన్’ నేపథ్యంలో అక్కడి అడవుల నుంచి కొంతమంది మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వైపు జారిపోయినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం రాగా, రెండు ప్రత్యేక బృందాలు నంద్యాల జిల్లాకు చేరుకున్నాయి. ఎర్రమల కొండ పరిధిలోని ఈ ప్రాంతాల్లో గాలింపు జరుగుతోంది.. నేలబిళం, ఓబులేసు కోన, ఎర్రకోన, బెలుం గుహల పరిసరాల్లో సుమారు 20 మందికిపైగా సశస్త్ర బలగాలు రెండు ప్రత్యేక వాహనాల్లో ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న పలు సిమెంట్ పరిశ్రమల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్‌కు చెందిన కూలీలు పనిచేస్తుండడంతో, వారిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసుల అనుమానం ప్రకారం.. మావోయిస్టులు ఈ కార్మికుల మధ్య మిళితం కావచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాంతం గతంలో మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది. 10 ఏళ్ల క్రితం ఇదే పరిసరాల్లో జనశక్తి నక్సల్స్ & పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్ జిల్లా వ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని మళ్లీ షెల్టర్ జోన్‌గా మావోయిస్టులు ఉపయోగించే అవకాశం ఉందనే అనుమానంతో సెక్యూరిటీ వ్యవస్థ అప్రమత్తమైంది. ఈ చర్యలతో గ్రామాల్లో టెన్షన్ నెలకొంది. అడవుల్లో హెలికాప్టర్లు కనిపించటం, పోలీసులు గ్రామాల్లో గస్తీ ఏర్పాటు చేయడంతో ప్రజల్లో భయాందోళనలు కనిపిస్తున్నాయి.
విశాఖ కేజీహెచ్‌లో అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన పేషెంట్లు..!
విశాఖ కేజీహెచ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. అయితే, సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది.. గుండె జబ్బుల విభాగంలో ఒక్కసారిగా దట్టంగా పొగలు అలుముకున్నాయి.. దీంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు పేషెంట్లు… ఉదయం ఆఫీస్ రూమ్ లో ఏసీ నుంచి మంటలు, దట్టమైన పొగ వెలువడ్డాయి.. సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.. .ప్రమాదానికి గల ప్రాథమిక కారణం షార్ట్ సర్క్యూట్ గానే భావిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది… ప్రమాద సమయంలో 45 మంది పేషెంట్లు ఉన్నారని తెలిపారు కేజీహెచ్ సూపరిండెంట్.. హుటాహుటిన వేరే బ్లాక్ కు పేషంట్లను తరలించి రక్షించారు.. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు పేషెంట్లు.. వైద్యులు, సిబ్బంది.. కేజీహెచ్ లో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై ఆందోళన చెందుతున్నారు రోగులు..
త్రిసభ్య కమిటీ సమావేశం.. అమరావతి రైతుల సమస్యలపై కీలక చర్చ
రాజధాని పరిధిలోని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వేగం పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మునిసిపల్, నగరాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సమస్యలు, భూవిభజన, ఆరోగ్య పథకాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఇక, సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. మొత్తం 1286 ప్లాట్లకు వీధి పోటు (ప్లానింగ్ & అలైన్మెంట్) సమస్యలు ఉన్నాయని తెలిపారు. వాస్తు పరంగా 156 మంది రైతులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. వాస్తు సమస్యలతో బాధపడుతున్న రైతులకు వేరే ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన హెల్త్ కార్డులు, పెన్షన్లు, సేవల నిలిపివేత వంటి సమస్యలు ఒక నెలలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు, లంక భూములు మరియు అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అసైన్డ్ ల్యాండ్‌ను మిగిలిన భూముల నుంచి వేరుచేసి, కేబినెట్లో చర్చిస్తాం అని స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమరావతి గ్రామాల్లోని జరీబు-నాన్ జరీబు, గ్రామకంఠం భూముల సమస్యలపై సమగ్ర పరిశీలన చేస్తున్నాం. వచ్చే కేబినెట్ సమావేశంలో అసైన్డ్ ల్యాండ్స్ మరియు లంక భూములపై నిర్ణయం తీసుకునే అవకాశముంది అన్నారు. అలాగే అమరావతి రాజధాని గ్రామాల్లో HD లైన్లు, రోడ్లు, నీటి వసతులు, ఇతర మౌలిక సౌకర్యాలపై ప్రభుత్వం ప్రాధాన్యతతో పనిచేస్తుందని తెలిపారు. రైతుల అభ్యర్థనలు, పెండింగ్ అంశాలు, భూవిభజన సమస్యలు తరచుగా సమీక్షించేందుకు ప్రతి రెండు వారాలకు రైతులతో సమావేశమై వారి సమస్యలు వింటాము అని త్రిసభ్య కమిటీ ప్రకటించింది.
ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నంటూ పలువురు యువతులకు ఎరా.. కట్‌చేస్తే..
ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నంటూ పలువురు యువతులకు ఎరేసిన కేటుగాడిని పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో యువతులను టార్గెట్ గా చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న యువకుడిని పట్టుకున్నారు. ఆ యువకుడి పేరు మహమ్మద్ షాజాద్ గా గుర్తించారు. బీహార్, పాట్నా జిల్లా, పలిగంజ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షాజాద్ ఆలం.. రెండేళ్ళ క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. సోషల్ మీడియాలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌నంటూ పలు ఫోటోలు, వీడియోలు పంచుకున్నాడు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, వింగ్ కమాండర్ హోదా కలిగిన దుస్తులతో మహ్మద్ షాజాద్ఆలం నమ్మించే ప్రయత్నం చేశాడు. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కేవలం యువతులకే ఎరా వేశాడు. నిందితుడి మాటలు విని పలువురు యువతులు డబ్బులు చెల్లించి మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా.. ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన ఉద్యోగాలు మధ్యవర్తిత్వం ద్వారా ఆశించొద్దని, అది సాధ్యపడదని పోలీసులు తెలిపారు. ఈ రకమైన ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా పోస్టులు అధికారిక వెబ్సైట్లో చూడాలని పేర్కొన్నారు.
ఫేస్బుక్లో “హాయ్”తో పరిచయమై.. రూ.14 కోట్లు కొట్టేసిన కిలేడీ..
అర్ధ రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకోవడం, అడ్డొస్తే హతమార్చి సొత్తు కాజేయడం ఒకప్పుడు నేరగాళ్ల పంథా. నగరంలో ఈ తరహా దోపిడీలు, దొంగతనాల స్థానంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోవడం కలవరపెడుతోంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో గత కొంతకాలంగా చోరీలు, ఇళ్లల్లో దొంగతనాల కేసుల్లో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. ఇదే సమయంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా నమోదవుతోంది. తాజాగా హబ్సిగూడ చెందిన డెంటల్ డాక్టర్‌ను సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేశారు. డాక్టర్ నుంచి 14 కోట్ల రూపాయల డబ్బులు కొట్టేశారు. అమ్మాయి పేరుతో వచ్చిన మెజేస్‌కు డాకర్ట్ స్పందించడమే ఈ దొపిడీకి ప్రధాన కారణం. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన ఓ డెంటాల్ డాక్టరుకు ఫేస్బుక్లో ఒక మెసేజ్ వచ్చింది. మౌనిక అనే పేరుతో మెసెంజర్‌కి మెసేజ్ వచ్చింది. తాను కష్టాల్లో ఉన్నానని ఆదుకోమని మౌనిక రిక్వెస్ట్ పెట్టింది. మౌనిక రిక్వెస్ట్ ని ఆ వైద్యుడు యాక్సెప్ట్ చేశాడు. మాయమాటలు చెప్పి డాక్టర్ని బుట్టలో వేసుకుంది మౌనిక.. ఈ తరుణంలోనే విదేశాల్లో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబలు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించింది. క్రిప్టో కరెన్సీ పేరుతో ట్రేడింగ్ అకౌంటు ఓపెన్ చేయించింది. నిందితురాలు క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలను నిర్వహించింది.. డెంటల్ డాక్టర్‌కి పెద్ద మొత్తంలో లాభాలను చూపెట్టింది. డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ రూపంలో కొంత చెల్లించాలంటూ బుకాయించింది. ట్యాక్స్ రూపంలో మూడున్నర కోట్లు చెల్లించినప్పటికీ డబ్బులు తిరిగా రాలేదు. మొత్తం 91సార్లు డాక్టర్ నుంచి మౌనిక డబ్బులు తీసుకుంది. డబ్బులు తిరిగి రాకపోవడంతో టీఎస్ సైబర్ బ్యూరోని కాంటాక్ట్ చేశాడు ఆ వైద్యుడు. ప్రస్తుతం ఈ అంశంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తమిళనాడులో దిత్వా తుఫాను బీభత్సం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత
దిత్వా తుఫాన్ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తుఫాను ఆదివారం తెల్లవారుజామున ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయంగా 300 కి.మీ. చెన్నైకి దక్షిణంగా 400 కి.మీ దూరంలో ఉంది. ఇక తీరం వెంబడి గాలుల వేగం గంటకు 50-60 కి.మీ నుంచి గంటకు 70 కి.మీ. వరకు ఉండనుంది. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుఫాన్ దగ్గర పడడంతో చెన్నై విమానాశ్రయం 54 విమానాలను రద్దు చేసింది. రాబోయే 48 గంటల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో రద్దుచేశారు. ఇక తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు మూసేశారు. ఇక శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటికే 123 మంది చనిపోయారు. మరో 34 మంది ఆచూకీ గల్లంతైంది. ఇక శ్రీలంకకు భారతదేశం మానవతా సాయం అందించింది. ప్రత్యేక కార్గో విమానాల్లో సహాయ సామాగ్రిని పంపించారు.
అంతా మీడియా సృష్టే.. డీకేతో విభేదాలు లేవన్న సిద్ధరామయ్య
మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్దాలేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. శనివారం ఉదయం బెంగళూరులోని సిద్ధరామయ్య నివాసంలో డీకే.శివకుమార్ బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అనంతరం ఇద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.. డీకే.శివకుమార్‌తో విభేదాలు ఉన్నట్లుగా వస్తున్న వార్తలు బీజేపీ, జేడీఎస్, మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. భవిష్యత్‌లోనూ ఉండబోవని సిద్ధరామయ్య వెల్లడించారు. 2028లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు. హైకమాండ్ సూచన మేరకే ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసినట్లు చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ షేరింగ్‌పై కొద్దిరోజులుగా ఫైటింగ్ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడి ఇటీవల రెండున్నరేళ్ల వేడుక చేసుకుంది. అప్పటి నుంచే రగడ మొదలైంది. పవర్ షేర్ చేయాల్సిందేనని డీకే.శివకుమార్ వర్గం మొండిపట్టుపట్టింది. హస్తిన వేదికగా సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గాలు హైకమాండ్‌తో మంతనాలు జరిపాయి. అయితే తాజా పరిణామాలను చూస్తుంటే.. పవర్ షేర్‌గా సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం డీకే.శివకుమార్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఖాయంగా తెలుస్తోంది. ఈ సస్పెన్ష్‌కు మరికొన్ని గంటల్లో ఫుల్స్టాప్ పడే సూచనలు కనిపిస్తున్నాయి.
పెళ్లంటే నిప్పుతో చెలగాటమే.. కొత్త జంటతో ధోని చమత్కారం!
ఎంఎస్ ధోని.. టీమిండియా మాజీ కెప్టెన్. ధోని క్రేజ్ ఏంటో క్రీడాభిమానులకు తెలిసిందే. గ్రౌండ్లోకి దిగాడంటే బ్యాట్‌తో చెలరేగిపోతాడు. సిక్స్‌లతో మోత మోగిస్తాడు. అలాంటి ధోని.. తాజాగా స్టాండప్ కమెడియన్‌గా మారిపోయారు. ఓ పెళ్లికి విశిష్ట అతిథిగా హాజరైన ఆయన.. స్టేజ్‌పైకి ఎక్కి తనదైన శైలిలో జోకులు వేసి అతిథులను ఉల్లాసపరిచారు. ధోని నవ్వుతూనే అనేక మందిని నవ్వులు పూయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టేజ్‌పై వధూవరుల పక్కన మైక్ పట్టుకుని నిలబడిన ధోనీ.. కొత్త జంటకు పలు సలహాలు.. సూచనలు ఇచ్చారు. పెళ్లి చేసుకోవడం గొప్ప విషయమే కానీ.. చేసుకోవడానికి తొందరపడ్డారని వ్యాఖ్యానించారు. దీంతో నూతన జంటతో పాటు కుటుంబ సభ్యులు, అతిథులంతా నవ్వుకున్నారు. అనంతరం వరుడి వైపు చూస్తూ.. కొంత మంది నిప్పుతో ఆడుకోవడానికి ఇష్టపడతారని.. అందులో ఇతడు కూడా ఒకడిని అనగానే కడుపుబ్బ నవ్వుకున్నారు. ఇక్కడున్న భర్తలందరి పరిస్థితి కూడా అంతేనని.. ప్రపంచ కప్ తర్వాత తన పరిస్థితి కూడా అంతేనని.. ఇందులో తనకు కూడా మినహాయింపు లేదని వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి అందరూ నవ్వుకున్నారు.
ఒక నిమిషం లేట్.. కృతీ శెట్టీ జీవితాన్ని ఎలా మార్చేసిందో తెలుసా ?
సినీ పరిశ్రమలో చాలా మంది ప్రణాళికలు వేసుకుని హీరో–హీరోయిన్ గా మారుతారు. అయితే కొందరికి మాత్రం అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టేస్తుంది. అలాంటి లక్కీ ఛాన్స్‌తో కెరీర్ దొరికిన హీరోయిన్ కృతీ శెట్టి. ఇక్కడ బెంగళూరులో పెరిగిన ఈ బ్యూటీ అసలు పుట్టింది మాత్రం ముంబైలో. తండ్రి వ్యాపారవేత్త కాగా, తల్లి ఫ్యాషన్ డిజైనర్. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి చూపిన కృతి, ముందుగా వాణిజ్య ప్రకటనల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. అదే నిర్ణయం ఆమెను హీరోయిన్గా మార్చింది. అతి చిన్న ఏజ్ 17 ఏళ్ల వయసులో ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన కృతీ శెట్టి ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా భారీ విజయంతో వరుస అవకాశాలు రాగా, తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ది వారియర్’, ‘కస్టడీ’ వంటి సినిమాల్లో నటించింది. అయితే వీటిలో కొన్ని మాత్రమే హిట్టవడంతో ఆమె క్రేజ్ కొంత తగ్గిపోయింది. దీంతో కృతీ టాలీవుడ్‌కే పరిమితం కాకుండా తమిళం, మలయాళంలో కూడా ప్రాజెక్టులు చేపట్టింది. ప్రస్తుతం తమిళంలో ‘జీనీ’, ‘వా వాద్దియార్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రాల్లో నటిస్తోంది. ఇవి ఆమె కెరీర్ మలుపు తిప్పే ప్రాజెక్టులు గా భావిస్తున్నారు. అయితే ఇటీవల ‘వా వాద్దియార్’ ప్రమోషన్లో పాల్గొన్న కృతీ శెట్టి, తన హీరోయిన్ జర్నీ పై ఆసక్తికర విషయాలు బయటపెట్టింది..
న్యూడ్ పోస్టర్‌పై ఆండ్రియా జెరెమియా క్లారిటీ!
కోలీవుడ్‌లో సంచలనం రేపిన ‘పిశాచి 2’ న్యూడ్ పోస్టర్‌పై హీరోయిన్ ఆండ్రియా జెరెమియా స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, సినిమా షూటింగ్ నుంచి వివాదాస్పద పోస్టర్ వరకు ఎన్నో కీలక విషయాలను వెల్లడించారు. ఆండ్రియా ‘పిశాచి 2’ షూటింగ్ చాలా కాలం క్రితం పూర్తయినా, పలు కారణాల వల్ల ఇప్పటి వరకు విడుదల కాలేదు. మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్‌లో, ప్రారంభ చర్చల సమయంలోనే టీమ్ ఓ బోల్డ్ సీన్ గురించి ఆమె చెప్పింది. కథాచర్చల సమయంలో ఆ సన్నివేశం గురించి ఓ నిర్ణయానికి వచ్చినా, అసలు షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఆ సీన్‌ను పూర్తిగా తొలగించారని వెల్లడించారు. అయితే సినిమా కోసం విడుదలైన పోస్టర్లో ఆమె నగ్నంగా పోజిచ్చిందన్న విమర్శలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. “పిశాచి 2 కోసం నేను ఎలాంటి న్యూడ్ సన్నివేశాల్లోనూ నటించలేదు. ఆ సినిమాలో ఎవ్వరూ అలాంటి సీన్లు చేయలేదు,” అని ఆండ్రియా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ పోస్టర్‌కు సినిమాతో నేరుగా సంబంధం లేదని సూచించింది. అంతేకాదు, సినిమా కథ ప్రకారం కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ అవి న్యూడిటీ తో సంబంధం లేని విధంగా, కథకు అవసరమైనంత మాత్రమే ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.