
1. చిరంజీవి, నయనతార కాంబినేషన్ మూడోసారి రిపీట్ అవుతోంది. సైరాలో భార్యాభరల్లా నటించిన చిరంజీవి, నయన ‘మన శంకరవరప్రసాద్’లో విడిపోయిన భార్యాభర్తల్లా కనిపిస్తున్నారు. మధ్యలో వచ్చిన గాడ్‌ఫాదర్‌లో అన్నాచెల్లెల్లుగా నటించారు. ఈ ఇద్దరి కాంబోలో సరైన హిట్ లేకపోయినా ఈ సెంటిమెంట్‌ను అనిల్ రావిపూడి పట్టించుకోలేదు.
2. బాలకృష్ణ, నయనతారది సూపర్‌హిట్ పెయిర్ కావడంతో నాలుగోసారి కలిసి నటిస్తున్నారు. సింహా, శ్రీరామరాజ్యం, జైసింహా హిట్స్తర్వాత నయన మరోసారి బాలయ్యతో జత కడుతోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రూపొందే సినిమాలో బాలయ్య సరసన నయన హీరోయిన్గా సెలెక్ట్ అయింది.
3. కెరీర్ స్టార్ట్ చేసి 43 ఏళ్లు దాటినా. ఇప్పటికీ క్రేజీ ఇమేజ్ తో దూసుకుపోతోంది టబు. బాలీవుడ్ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న టబు నాగార్జునతో ఆడిపాడనుంది. నాగ్ నటిస్తున్న 100వ సినిమాలో హీరోయిన్గా టబును సెలెక్ట్ చేశారని తెలిసింది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన నిన్నే పెళ్లాడతా బ్లాక్‌బస్టర్ కాగా ఆవిడా మా ఆవిడే హిట్టయింది.
4. విజయ్, సంకృత్యాన్ మూవీలో రష్మిక హీరోయిన్ అంటూ వస్తున్న వార్తలకు మైత్రీ స్పందిస్తూ ‘వేచి చూద్దాం అని అర్థం వచ్చేలా’ #HmmLetsSee’ అని రష్మికను ట్యాగ్ చేసింది. దీనికి ఆమె రిప్లై ఇస్తూ ‘ఓకె’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేసింది. దీంతో ఈ లవర్స్ మరోసారి జత కడుతున్నారంటూ రౌడీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
5. చిన్న సినిమాగా రిలీజై పెద్ద హిట్ కొట్టిన బేబి కాంబో రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమాతో 90s మిడిల్‌క్లాస్ బయోపిక్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
6. స్టాలిన్ ఫ్లాప్ అయినా చిరంజీవి, త్రిష కాంబినేషన్ రిపీట్ అయింది. ఇద్దరూ కలిసి నటించిన స్టాలిన్ ప్లాప్ కాగా విశ్వంభరలో మరోసారి జంటగా కనిపించనున్నారు. సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా బింబిసార ఫేం వశిష్ట డైరెక్షన్లో రూపొందుతోంది.