
శ్రీలంకపై దిత్వా తుఫాన్ విరుచుకుపడింది. భారీ ఈదురుగాలులతో కుండపోత వర్షం కురిసింది. దీంతో శ్రీలంక అతలాకుతలం అయింది. పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ఇప్పటి వరకు 123 మంది ప్రాణాలు కోల్పోయారు. 130 మంది వరకు గల్లంతయ్యారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇళ్లు ధ్వంసమయ్యాయని.. 43,995 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు విపత్తు నిర్వహణ కేంద్రం శనివారం తెలిపింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని డైరెక్టర్ జనరల్ సంపత్ కొటువేగోడ తెలిపారు. సాయుధ దళాల సహాయంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. తుఫాన్ బుధవారం తాకిందని.. ద్వీపమంతటా రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదైనట్లుగా పేర్కొన్నారు.

ప్రస్తుతం తుఫాన్ భారతదేశం దిశగా సాగుతోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో బీభీత్సం సృష్టించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇక శ్రీలంకలో జరిగిన ప్రాణ నష్టంపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మానవతా దృక్పథంతో శ్రీలంకకు ప్రత్యేక విమానాల్లో సాయాన్ని కూడా పంపించారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: 3 పెళ్లిళ్లు.. ఇద్దరు పిల్లలు.. వెలుగులోకి షాహీన్ ప్రేమకథ!