Spirit : ‘స్పిరిట్’ లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఫిక్స్ ?

Prabhas Spirit Movie Kajol Casting Update Kareena Clarifies

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ప్రభాస్ హీరోగా, యాక్షన్–కాప్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారంటూ వచ్చిన వార్తలకు ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది “నేను స్పిరిట్‌లో లేను” అని చెబుతూ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీలో ఒక ప్రభావవంతమైన పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ ను అప్రోచ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. స్క్రిప్ట్ ఆమెను బాగా ఇంప్రెస్ చేయడంతో, కాజోల్ పాజిటివ్‌గా స్పందించినట్లు తెలుస్తొంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read : Dies-Irae : ఓటీటీ డేట్ లాక్ చేసిన మలయాళ హారర్ హిట్ ‘డీయస్ ఈరే’.. కానీ ట్విస్ట్ ఏంటంటే..

కాజోల్ ఇంతకు ముందు రెండు తమిళ సినిమాల్లో నటించినప్పటికీ, ఇప్పటివరకు ఒక్క తెలుగు చిత్రంలో కూడా కనిపించలేదు. అయితే బాలీవుడ్‌లో ఆమెకు ఉన్న క్రేజ్, నటనలో ఉన్న నాణ్యత దక్షిణాదిలో కూడా మంచి ఫాలోయింగ్‌ను తెచ్చింది. అందుకే ‘స్పిరిట్’లో ఆమె ఉంటే సినిమా మరింత బలపడే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగా పాత్రలను డిజైన్ చేయడంలో స్పెషలిస్టే. కాబట్టి కాజోల్‌కి కూడా ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఇచ్చే అవకాశమే ఉంది. ఇప్పటికే బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో భాగమయ్యారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పిరిట్ సౌండ్ ఆడియో వీడియోలో ఆయన పాత్రను రివీల్ చేశారు. ఇప్పుడు త్రిప్తి దిమ్రీతో పాటు కాజోల్ పేరు వినిపిస్తుండటంతో, ‘స్పిరిట్’పై హైప్ మరింత పెరిగిపోయింది.