Lady Gang: విజయవాడలో రెచ్చిపోయిన లేడీ గ్యాంగ్

Lady Gang Creates Chaos In Vijayawada Chowki Center With Midnight

Lady Gang: విజయవాడ నగరంలోని చౌకీ సెంటర్ పరిసరాల్లో లేడీ గ్యాంగ్ దోపిడీలతో స్థానిక వ్యాపారుల అవస్థలు పడుతున్నారు. అర్థరాత్రి సమయంలో ఈ గ్యాంగ్ వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ మార్కెట్ ప్రాంతంలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తోంది. కాగా, గత కొన్ని రోజుల నుంచి శ్రీ లక్ష్మీ గణపతి కెమికల్స్‌ సహా సమీపంలోని పలు దుకాణాల్లో పెద్ద మొత్తంలో వస్తువులు కనిపించకుండా పోవడంతో వ్యాపారులు నష్టపోయారు. దుకాణంలో స్టాక్ తగ్గిపోవడాన్ని గమనించిన కెమికల్స్ షాప్ యజమాని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఆశ్చర్యకర విషయాలు రికార్డు అయ్యాయి.

Read Also: Russia-WhatsApp: రష్యా సంచలన నిర్ణయం.. వాట్సాప్‌పై నిషేధం!

అయితే, సీసీ కెమెరాల్లో లేడీ గ్యాంగ్ సభ్యులు రాత్రివేళ దుకాణంలో చొరబడి దొంగతనం చేస్తున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపించాయి. వెంటనే షాప్ యజమాని ఈ వీడియోలను ఆధారంగా చేసుకుని విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. ఇక, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా లేడీ గ్యాంగ్ సభ్యుల గుర్తింపునకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. చౌకీ సెంటర్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, వరుస దొంగతనాలకు కారణమైన గ్యాంగ్‌ను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారు.