
Kapil Dev: స్వదేశంలో 2-0 తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. దీంతో ప్రధాన కోచ్ పదవిలో గౌతమ్ గంభీర్ కొనసాగాలా? వద్దా? అనే నిర్ణయంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. అలాగే, స్పిన్ ఆడే విషయంలో టీమిండియా బ్యాటర్ల సమర్థతపై క్రికెట్ పండితులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి కోహ్లీ , రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం భారత జట్టు సరైన మార్గంలో పయనిస్తోందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: India – Afghanistan: పాకిస్థాన్ – ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతలు.. కాబూల్‌కు భారత్ సహాయం..
అయితే, ప్రస్తుతం జట్టు ఎక్కువగా టీ20లు, వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడుతుంది.. దీంతో బ్యాటర్లు, బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై బౌలర్లు సంధించే బంతులను ఎదుర్కొనే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందని టీమిండియా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. స్పిన్, పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై బ్యాటర్లు చాలా ఓపికగా ఆడాలి.. అలాగే, ప్రత్యేక నైపుణ్యం కలిగిన బ్యాటర్లు కూడా టీంలో ఉండాలి.. ప్రస్తుత భారత జట్టులో క్రీజులో పాతుకుపోయే.. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి బ్యాటర్లు లేరని తెలిపారు. ఇక, స్పిన్, పేస్‌ను ఎదుర్కోవాలంటే అద్భుతమైన స్కిల్స్ ఉండాలి.. కానీ టర్న్, బౌన్స్ ఎక్కువగా ఉండే పిచ్‌లపై బ్యాటింగ్ చేయాలంటే చాలా కష్టమని కపిల్ దేవ్ చెప్పుకొచ్చారు.
Read Also: Localbody Elections : ఎన్నికల బరిలో మాజీ మావోయిస్టు జ్యోతి
అలాగే, టెస్ట్ క్రికెట్ లో ఫుట్ వర్క్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని బ్యాటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోకూడదు అని టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ సూచించారు. ఇక, రిషభ్ పంత్ విషయం మాత్రం వేరు.. ఎందుకంటే అతడు సహజ సిద్ధమైన మ్యాచ్ విన్నర్.. అతడ్ని డిఫెన్స్ ఆడమని మనం చెప్పలేం, ఎందుకంటే పంత్ సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడి, ప్రత్యర్థి జట్టును భయపెట్టగల సమర్థుడు.. అలాంటి నైపుణ్యమున్న ప్లేయర్ ని.. మనం నెమ్మదిగా ఆడి 100 బంతుల్లో 20 రన్స్ చేయమని చెప్పలేం కదా అని కపిల్ దేవ్ అన్నారు.