
Varanasi: దర్శకధీరుడు రాజమౌళి గురించి చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జక్కన్న స్థాయి ప్యాన్ ఇండియా సరిహద్దులు దాటి అంతర్జాతీయ రేంజ్‌కు వెళ్లిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత రాజమౌళి చేయబోయే నెక్ట్స్ సినిమాపై ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు నెలకున్నాయి. ఇదే సమయంలో మహేష్ బాబు అభిమానులు ఖుషీ అయ్యే న్యూ్స్ వైరల్ అయ్యింది. జక్కన్న కొత్త సినిమా మహేష్ బాబుతోనే అని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలో నిర్వహించిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్స్ కూడా ఇచ్చారు. ఈ ఈవెంట్ ఒక్కసారిగా ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు పెంచింది. అయితే రాజమౌళి-మహేష్ బాబు సినిమా టైటిల్.. ‘వారణాసి’ విషయంలో ఒక తిరకాసు వచ్చిపడింది. కానీ ఇప్పుడు బాబు ఫ్యా్న్స్‌కు గుడ్ న్యూస్ వచ్చినట్లు సినీ సర్కీల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
READ ALSO: Kapil Dev: హెడ్‌కోచ్‌గా గంభీర్ కొనసాగాలా? వద్దా?.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి – మహేశ్ బాబు ‘వారణాసి’ సినిమా కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసింది. ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించక ముందు నుంచే టైటిల్‌పై సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వైరల్ అయ్యాయి. అయితే మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించడానికి ముందే గతంలోనే తెలుగులో మరో నిర్మాణసంస్థ ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ వివాదం తాజాగా క్లియర్ అయినట్లు సమాచారం. ఈ టైటిల్‌ను తెలుగులో మాత్రమే వేరే నిర్మాణసంస్థ రిజిస్టర్ చేసుకోవడంతో.. సినిమా యూనిట్ తెలుగు టైటిల్లో చిన్న మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను ‘రాజమౌళి వారణాసి’ పేరుతో విడుదల చేయనున్నట్లు సమాచారం. మిగిలిన అన్ని భాషల్లో కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్‌ను ‘వారణాసి’ పేరుతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
READ ALSO: India – Afghanistan: పాకిస్థాన్ – ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతలు.. కాబూల్‌కు భారత్ సహాయం..