
Ambati Rambabu: ఏపీ రాజధాని అమరావతి కథ.. అంతులేని కథలా మారింది అని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తే తమకు లబ్ది చేకూరుతుందని ఈ ప్రాంత రైతులు ఉద్యమాలు కూడా చేశారు.. అమరావతి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.. రైతులను పెనం మీద నుంచి పొయ్యిలో పడేసేలా ప్రయత్నం చేస్తున్నారు.. అమరావతి ప్రాంత రైతులు ఇప్పటికే 35 వేల ఎకరాలు భూములు ఇచ్చారు.. మొత్తం ప్రభుత్వ భూములతో కలిపి 50 వేల ఎకరాలతో ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని కడతామని ప్రగల్భాలు పలికారు.. రెండవ దశలో 16,666 ఎకరాలు.. ప్రభుత్వం భూములతో కలిపి 20 ఎకరాలు సేకరించాలని కేబినెట్ లో చర్చించారు.. మళ్ళీ మూడవ దశ కూడా ఉంటుందంటున్నారు.. గతంలో రైతుల దగ్గర భూములు తీసుకునే సమయంలో ఇన్ని దశల్లో భూసేకరణ ఉంటుందని చెప్పలేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Read Also: Kapil Dev: హెడ్‌కోచ్‌గా గంభీర్ కొనసాగాలా? వద్దా?.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
అయితే, రైతులకు ఇన్నాళ్లు గడిచినా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. అసలు ఫూలింగ్ లో లేని చోట్ల ఇస్తామంటున్నారు.. అసలు రైతులకు సమాధానాలు చెప్పేవారు లేరు.. ఒక్క మంత్రి కూడా రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. గతంలో రైతులను త్యాగధనులు అన్నారు.. ఇప్పుడు కనీసం వారి గురించి పట్టించుకోవటం లేదు.. గతంలో 50 వేల ఎకరాలతో వరల్డ్ క్లాస్ రాజధాని అన్నారు.. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు కావాలి అంటున్నారు.. చంద్రబాబు అమరావతి పేరు చెప్పి దోచుకుంటున్నారని ఆరోపించారు. గతంలో రైతుల దగ్గర తీసుకున్న భూములకు లక్ష కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. ఇప్పటి వరకు కేవలం 4 వేల కోట్ల వరకు మాత్రమే ఖర్చు పెట్టారు.. చంద్రబాబు మళ్లీ వస్తే మా భూముల ధరలు పెరుగుతాయని రైతులు అనుకున్నారు.. ఇంత వరకు ఎక్కడా భూముల ధరలు పెరగలేదు.. ఇప్పటివరకు అమరావతిలో ఒక్క తట్ట మట్టి అయినా ఎత్తిపోసారా అని అంబటి ప్రశ్నించారు.
Read Also: Karnataka Congress: సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ‘‘రాజీ’’కి కారణాలు ఇవేనా?
కానీ, మొబలైజేషన్ అడ్వాన్సుల పేరు చెప్పి 3 వేల కోట్లు ఇచ్చారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు కొట్టేశారు.. రాజధాని కోసం లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారు.. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని డబ్బాలు కొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అప్పుల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు.. పలు సంస్థల నుంచి లక్షల కోట్లు అప్పులు తెచ్చారు.. ఇంకా చాలా అప్పులు పైప్ లైన్ లో ఉన్నాయి.. అమరావతిలో గతంలో 41 వేల కోట్లకు టెండర్లు పిలిస్తే.. కేవలం 5 వేల కోట్ల పనులు మాత్రమే చేయించారు.. ఇప్పుడు ఆ పనులకు మళ్ళీ రీ టెండర్లు పిలిచారు.. గతంలో పెండింగ్ లో ఉన్న 35 వేల కోట్ల పనుల విలువను 48 వేల కోట్లకు పెంచారు.. అమరావతి విషయంలో చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధి లేదు.. కేవలం దోచుకోవటమే పనిగా చంద్రబాబు, లోకేష్ పెట్టుకున్నారని మాజీ మంత్రి రాంబాబు ఆరోపించారు.