CM Chandrababu: మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి..

Working For The Development Of All Three Regions In Ap Cm Chandrababu

CM Chandrababu: మీడియాతో చిట్ చాట్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధానిలో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఒక్కటే కమిటీ వేశాం.. రైతులకు సంబంధించిన ప్రతి పనికి CRDA అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంపై విచారణ చేయిస్తాం.. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే రాజధాని రైతుల నుంచి సిబ్బంది డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూమిని త్యాగం చేసిన రైతుల సమస్యలు పరిష్కరించకుండా డబ్బులు డిమాండ్ చేస్తారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాం.. ఇందుకు అనుగుణంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది నాటికి అమరావతి నిర్మాణం ఒక కొలిక్కి వస్తుంది.. రాజధాని ప్రాంతంలో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో లేఔట్స్ కి త్వరలోనే అనుమతి ఇస్తాం.. క్యాపిటల్ గెయిన్సు కు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. రాజధాని రైతులంతా ఇక ఒకే గొడుగు కిందకు రావాలని చంద్రబాబు సూచించారు.

Read Also: IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌.. రోహిత్‌, కోహ్లీ ఎంట్రీతో జట్టు బలం పెరిగేనా..?

అయితే, అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కింద అంతా ఒకే జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని రైతులు కోరిన క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించాం.. కేంద్రం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది.. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలన్నీ దశల వారీగా పరిష్కరిస్తాం.. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెట్టాం.. త్వరలోనే ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తామని సూచించారు. రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్ ఉంది.. నాతో సమావేశం తర్వాత అన్నింటి పైనా క్లారిటీ వచ్చింది.. రైతులు కూడా ఆనందంగా ఉన్నారు.. రెండో దశ భూ సమీకరణ ఉపయోగాలపై రైతులకు వివరించాను.. మున్సిపాలిటీగా అమరావతి మిగిలిపోకుండా మహానగరంగా అభివృద్ది చెందితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో రైతులు అర్థం చేసుకున్నారు.. త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. ఇక, రాజధాని అభివృద్ది ఇక అన్ స్టాపబుల్ అన్నారు. రాజధాని చుట్టు పక్కల ప్రాంతాల్లో లే-ఔవుట్లకు అనుమతుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం.. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలియజేశారు.