NBK 111 Mass Dialogue: బాలయ్య బేస్ వాయిస్‌లో ఊర మాస్ డైలాగ్ లీక్..

Balakrishna Mass Dialogue Leak Akhanda2 Event

NBK 111 Mass Dialogue: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి నటసింహం బాలయ్య బాబు రూటే సపరేటు. ఆయన అభిమానులలోనే కాకుండా సినిమా ప్రేక్షలలో బాలయ్య బాబు డైలాగ్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం బాలయ్య బాబు బేస్ వాయిస్‌తో, ఊర మాస్ డైలాగ్‌లు చెప్తే హిట్ కొట్టిన సినిమాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి ఆయన చెప్పిన ఆ డైలాగుల పవర్ ఎలాంటిదో. అందుకే బాలయ్య బాబు సినిమాలకు డైలాగ్స్ రాయాలంటే కొంచెం టఫ్ అని సినీ సర్కీల్‌లో వినిపిస్తుంటాయి.

READ ALSO: Australian PM Wedding: 62 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం.. ప్రధాని జీవితంలో సరికొత్త అధ్యాయం..

నిన్న జరిగిన అఖండ 2 ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య బాబు స్పీచ్ ఈవెంట్‌కే హైలట్‌గా నిలిచింది. వాస్తవానికి బాలయ్య బాబు – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా అంటే నందమూరి అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గతంలో వీరిద్దరిలో కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో డైలాగ్స్ ఎంత పవర్ పుల్‌గా ఉంటాయో అందరికి తెలిసిందే. అఖండ 2 సినిమాలో కూడా బాలయ్య బాబు పలికే ఒక్కో డైలాగ్ భీభత్సంగా ఉండబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాల్లో బాలయ్య బాబు పలికే ఒక్కో డైలాగ్ ఊర మాస్‌తో ఉన్నాయనే టాక్ నడుస్తుంది. ఇక ఇదే వేదిక పైనుంచి బాలయ్య బాబు తన కొత్త సినిమా 111వ చిత్రంలోని ఒక ఊర మాస్ డైలాగ్‌ను లీక్ చేశారు. తాజాగా ఈ డైలాగ్ బాలయ్య అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. “చరిత్రలో చాలామంది ఉంటారు. కానీ సృష్టించిన చరిత్రను మరల మరల తిరగరాసి సృష్టించే వాడు ఒక్కడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర నాదే ఆ చరిత్ర” అంటూ బాలయ్య ఈ ఊర మాస్ డైలాగ్‌ను తన బేస్ వాయిస్‌తో పలకడంతో ఈవెంట్‌కు వచ్చిన నందమూరి అభిమానులు కేరింతలు కోడుతూ ఊగిపోయారు. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకుడు. బాలయ్య నుంచి ఊహించని విధంగా ఈ పవర్ఫుల్ డైలాగ్ లీక్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

READ ALSO: Varanasi: బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. తెలుగులో ‘వారణాసి’ టైటిల్ ఇదేనా!