IBomma Ravi : బప్పం స్టోరీ మొత్తం చెప్పిన రవి

Ibomma Ravi Second Custody Hyderabad

IBomma Ravi : హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీమ్ ఐబొమ్మ రవి పై మరో విడత కస్టడీ కఠిన విచారణ జరిపింది. రవి తన మెయిల్ అకౌంట్స్ రిట్రైవ్ చేసిన విషయాలను పోలీసులకు వివరించాడు. పోలీసులు గుర్తించినట్టు, ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్స్‌లో 21,000కి పైగా సినిమాలు పైరసీ చేయబడి ఉంటాయి. పోలీసుల పరిశీలనలో, రవి పైరసీ వెబ్‌సైట్స్ నుండి సినిమాలను రికార్డింగ్ చేసి, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై వచ్చే సినిమాలను కూడా కాపీ చేశాడని గుర్తించారు. ఈ సినిమా రికార్డింగ్ కోసం రవి ఆడియో, వీడియో క్వాలిటీ పెంచడానికి కరేబియన్ దీవుల్లో ఉన్న ఔట్‌సోర్సింగ్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పాడు.

Addanki Dayakar : 1200 మంది అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్ష ఎక్కువనా.?

రవి పోలీసులకు పైరసీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, తన వెబ్‌సైట్ల నిర్వహణ గురించి వివరాలను అందించాడు. పూర్తి పేరును “ఇంటర్నెట్ బొమ్మ”గా వెల్లడించిన రవి, విశాఖలో సినిమాలను బొమ్మగా పిలిచేవాడని, ఇంటర్నెట్‌లో బొమ్మగా చూపించినందుకే ఐబొమ్మ అనే పేరు పెట్టినట్టు తెలిపారు. అంతే కాకుండా, మరో వెబ్‌సైట్‌కు “బలపం” అనే పేరు పెట్టాలని భావించినప్పటికీ, డొమైన్‌లో సాంకేతిక సమస్య కారణంగా L అక్షరాన్ని తీసి “బప్పం”గా మార్చినట్లు తెలిపారు. రవి అప్‌లోడ్ చేసిన సినిమాలన్నీ టెలిగ్రామ్ గ్రూపుల నుంచి తీసుకున్నవే అని కూడా స్పష్టం చేశారు.

NBK 111 Mass Dialogue: బాలయ్య బేస్ వాయిస్‌లో ఊర మాస్ డైలాగ్ లీక్..