Mana Shankar Varaprasad Garu OTT Rights: ఆ ఓటీటీలోనే మన శంకర్ వరప్రసాద్‌గారు స్ట్రీమింగ్..

Mana Shankar Varaprasad Ott Rights Update

Mana Shankar Varaprasad Garu OTT Rights: మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడి షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారని టాక్ నడుస్తుంది. మరో వైపు ఈ సినిమాతో పాటు సంక్రాంతికి వెండి తెరపైకి రానున్న ఇతర సినిమాలు కూడా షూటింగ్‌ల వేగాన్ని పెంచాయి. ఆయా సినిమాల చిత్రీకరణలు డిసెంబరు చివరి నాటికి పూర్తి చేసుకుని, కొత్త సంవత్సరంలో సరికొత్తగా ప్రచార కార్యక్రమాలను చేయాలని ప్లాన్ చేస్తున్నాయి.

READ ALSO: Tata Sierra Price: సెల్టోస్, క్రేటా, విక్టోరిస్‌తో పోల్చితే టాటా సియెర్రా ధర ఎక్కువా, తక్కువా.?

ఇదే ఊపులో ఆయా సినిమాల మేకర్స్ ఓటీటీ సహా అన్నీ డీల్స్‌ను పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఓటీటీ రైట్స్ డీల్‌ పూర్తయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌ సర్కిల్‌లో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా శాటిలైట్ రైట్స్‌ను జీ 5, జీ నెట్‌వర్క్ సొంతం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో వచ్చిన అనిల్‌ రావిపూడి – వెంకటేశ్‌ల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఓటీటీ రైట్స్‌ను కూడా జీ నెట్‌వర్క్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే బాటలో ఈ కొత్త సినిమా కూడా వెళ్తున్నట్లు సమాచారం. అయితే జీ గ్రూప్‌ నిజంగానే ఈ సినిమా హక్కుల్ని సొంతం చేసుకుందా? ఆ డీల్ ఎంత? అనే తెలియరాలేదు. సినీ సర్కిల్‌లో జోరుగా సాగుతున్న ఈ ప్రచారంపై ఇప్పటి వరకు జీ నెట్‌వర్క్ గానీ, చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. చూడాలి మరి మన శంకర్ వరప్రసాద్‌గారు ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుందో లేదో అనేది.

READ ALSO: Aunty Viral Dance: పెళ్లి వేడుకలో డ్యాన్స్‌తో అదరగొట్టిన ఆంటీ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో!