
Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడులో ప్రేమ జంటను కాపాడేందుకు పోలీసులు ఏకంగా స్టేషన్ గేట్లను మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్థానిక బాపునగర్‌కు చెందిన యువతి- యువకుడు ప్రేమ పెళ్లి చేసుకుని ప్రాణభయంతో నూజివీడు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న బెదిరింపుల కారణంగా పోలీసుల దగ్గర రక్షణ కోరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేమ జంట స్టేషన్‌లో ఉన్నట్టు తెలుసుకున్న ఇరు కుటుంబాలు అక్కడికి చేరుకుని స్టేషన్ ముందు పెద్ద ఎత్తున గొడవకు దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో యువకుడిపై కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడగా, వెంటనే పోలీసులు అతడిని- యువతిని స్టేషన్ లోపలికి తీసుకెళ్లి తలుపులు మూసేశారు.
Read Also: Mana Shankar Varaprasad Garu OTT Rights: ఆ ఓటీటీలోనే మన శంకర్ వరప్రసాద్‌గారు స్ట్రీమింగ్..
అయితే, పోలీస్ స్టేషన్ గేట్లు మూసివేసినా, లోపలికి చొరబడేందుకు ఇరు కుటుంబ సభ్యులు ప్రయత్నించడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసుల జోక్యంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేపట్టారు. ప్రేమ జంట భద్రత కోసం అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసు వర్గాలు చెప్పుకొచ్చాయి. ఈ సంఘటనతో నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతతో ప్రేమ జంట రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.